ప్రధాన మంత్రి కార్యాలయం
జపాన్ కొత్త ప్రధాని సానే తాకాయిచీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
21 OCT 2025 11:24AM by PIB Hyderabad
జపాన్ ప్రధానమంత్రి పదవికి సానే తాకాయిచీ ఎన్నికైన సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు. ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ భారత్, జపాన్ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీ, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాన్నీ మరింత బలపరుచుకోవాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు.
‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘సానే తాకాయిచీ.. మీరు జపాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన సందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలు. భారత్, జపాన్ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీ, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాన్నీ మరింత బలపరుచుకోవడానికి మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. ఇండో-పసిఫిక్ ప్రాంతం పొడవునా, అంతకన్నా విస్తృత స్థాయిలోనూ శాంతి, సుస్థిరత్వం, సమృద్ధి చిరకాలం కొనసాగేందుకు మన మధ్య సంబంధాలు మరింత ముందుకు వెళ్లడం ఎంతో అవసరం.’’
***
(Release ID: 2181143)
Visitor Counter : 14
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Bengali-TR
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam