ప్రధాన మంత్రి కార్యాలయం
భారతీయ ఉత్పత్తులను కొనండి... దేశ పౌరులకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 OCT 2025 8:36PM by PIB Hyderabad
నూట నలభై కోట్ల మంది కష్టపడి వినూత్న ఆలోచనలతో రూపొందించిన భారతీయ ఉత్పాదనలను ఈ ఉత్సవ కాలంలో కొనుగోలు చేసి, వారి శ్రమను గౌరవించి పండుగ చేసుకోవాల్సిందిగా దేశ పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘‘మనం భారతీయ వస్తువులనే కొందాం.. ఇవి స్వదేశీ వస్తువులు అని గర్వంగా చాటుదాం, రండి. మీరు కొన్న వాటిని సామాజిక మాధ్యమంలోనూ పంచుకోండి. ఇలా చేస్తే, మీరు చేసిన పని ఇతరుల్లో స్ఫూర్తిని కలిగిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘నూట నలభై కోట్ల మంది కష్టపడి వినూత్న ఆలోచనలతో రూపొందించిన భారతీయ ఉత్పాదనలను.. ఈ ఉత్సవ కాలంలో.. ఆదరిద్దాం... రండి.
భారతీయ వస్తువులనే కొనుగోలు చేద్దాం. మరి ఇవి స్వదేశీ వస్తువులు అంటూ గర్వంగా చాటిచెబుదాం.
మీరు కొన్న వస్తువులను సామాజిక మాధ్యమంలోనూ పంచుకోండి. ఈ విధంగా మీరు.. ఇతరులు కూడా మీరు చేసిన పనినే చేసేలా, వారిలో స్ఫూర్తిని నింపగలిగిన వారవుతారు.’’
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2181051)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam