కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దీపావళి బొనాంజా... పండుగ ఆఫర్లను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

Posted On: 17 OCT 2025 4:13PM by PIB Hyderabad

ఢిల్లీ, 2025 అక్టోబర్ 15: దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్ఈ రోజు ప్రత్యేక దీపావళి బొనాంజాగా... పండుగ ఆఫర్లను ప్రకటించింది

దీపాల పండుగను చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్న వేళ వినియోగదారులందరికీ పండుగ ఆఫర్లను ప్రకటించిందిఈ ఆఫర్ల కింద కొత్త పాత వినియోగదారులువ్యక్తిగత వ్యాపార వినియోగదారులు ప్రయోజనాలు పొందుతారుఇందులో భాగంగా వయో వృద్ధులకు కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయి. 2025 అక్టోబర్ 18 నుంచి 2025 నవంబర్ 18 ఉండనున్న ఈ ఆఫర్లను.. ఆనందాన్ని పంచుకోవడంవెలుగును వ్యాప్తి చేయడంకనెక్షన్‌లను బలోపేతం చేయడం అనే దీపావళి స్ఫూర్తిని పంచుకోవడానికి తీసుకొచ్చింది.

కొత్త వినియోగదారుల కోసం దీపావళి బొనాంజా 4జీ ప్లాన్

దీపపు కాంతుల్లో కొత్త కనెక్షన్లు”

బీఎస్ఎన్ఎల్ కుటుంబంలోకి కొత్త వినియోగదారులను స్వాగతించేందుకు రూ. 1 దీపావళి 4జీ ప్లాన్‌ను ప్రారంభించిందిఇది కొత్త వినియోగదారులకు ఒక నెల ఉచిత మొబైల్ సేవలను అందిస్తుందినామమాత్రపు యాక్టివేషన్ రుసుంగా కేవలం రూ. 1 చెల్లించడం ద్వారా కొత్త వినియోగదారులు.. 30 రోజుల అపరిమిత కనెక్టివిటీని పొందొచ్చుకొత్త వినియోగదారులకు దీపావళి సందర్భంగా బీఎన్ఎన్‌ఎల్ ఇచ్చిన బహుమతి ఇదిఇటీవలే ప్రారంభమైన స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌పై బీఎస్‌ఎన్ఎల్‌కు ఉన్న విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోందిఎలాంటి ఖర్చు లేకుండా నెట్‌వర్క్‌ ప్రయోజనాలను తెలుసుకోవాలని కొత్త వినియోగదారులను ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఆహ్వానిస్తోంది

దీపావళి బొనాంజా ప్లాన్‌ ముఖ్యమైన ప్రయోజనాలు (మొదటి 30 రోజులు):

ఇష్టమైన వారితో మాట్లాడేందుకు అపరిమిత వాయిస్ కాల్స్ (ప్లాన్ నిబంధనలుషరతుల ప్రకారం)
వీడియోలుఫోటోలతో పాటు పండుగ శుభాకాంక్షలు ఉచితంగా పంచుకునేందుకు రోజుకు జీబీ హై-స్పీడ్ డేటా
దీపావళి శుభాకాంక్షలు పంపించేందుకు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు
యాక్టివేషన్‌తో ఉచిత సిమ్ కార్డ్ (డీఓటీ మార్గదర్శకాల ప్రకారం కేవైసీ తప్పనిసరి)

2025 అక్టోబర్ 15 నుంచి 2025 నవంబర్ 15 వరకు కనెక్షన్ తీసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది

ఈ పండుగ ప్లాన్‌ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్ సీఎండీ శ్రీ ఎరాబర్ట్ జేరవి మాట్లాడుతూ.. “దీపావళి అంటే కొత్త ప్రారంభాలువెలుగుల వేడుకలకు ప్రతీకనెల రోజుల ఉచిత ప్లాన్‌ అనే బహుమతితో కొత్త వినియోగదారులను  స్వాగతించటం పట్ల మేం సంతోషంగా ఉన్నాందీపావళి సందర్భంగా వేడుక చేసుకునేందుకు అంతా సిద్ధమౌతున్న వేళ.. ఈ రూ. 1 దీపావళి బొనాంజా ప్లాన్ ద్వారా ప్రజలు మా అత్యాధునికభారత్‌లో తయారైన 4జీ నెట్‌వర్క్‌ను వాడి చూడాలని కోరిందిసేవల్లో నాణ్యత పెరిగినట్లు వినియోగదారులు భావించినట్లయితే పండుగ సీజన్ తర్వాత కూడా మీరు బీఎస్ఎన్ఎల్‌తో కొనసాగుతారని మేం విశ్వాసంతో ఉన్నాం” అని అన్నారు

బీవినియోగదారుల కోసం లక్కీ డ్రా

సంపదల సంబరంసంతోషాల బంధం”

పాత వినియోగదారుల పండుగ ఆనందానికి దీపావళి లక్కీ డ్రా‌తో అదనపు వెలుగును బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. 2025 అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో సెల్ఫ్-కేర్ యాప్ లేదా బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌లో రూ. 100 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు అదే రోజు లక్కీ డ్రా‌కు ఆటోమేటిక్‌గా అర్హత సాధిస్తారుపాత వినియోగదారులతో పాటు బొనాంజా సమయంలో చేరిన వినియోగదారులకు కూడా ఈ లక్కీ డ్రా వర్తిస్తుంది

రీఛార్జ్ చేసుకున్న వారు లక్కీ డ్రా‌లోకి ఆటోమేటిక్‌గా వెళ్తారుఇందులో పది మంది వినియోగదారులు.. ప్రతిరోజూ 10 గ్రాముల వెండి నాణేలను గెలుచుకుంటారువీటిని ఆయా వినియోగదారులకు డెలివరీ ద్వారా అందిస్తారు.

లక్కీ డ్రా గురించి బీఎస్ఎన్ఎల్ సీఎండీ శ్రీ ఎరాబర్ట్ జేరవి మాట్లాడుతూ.. “భారతదేశ వ్యాప్తంగా లక్షలాది దీపాలను వెలిగిస్తున్న వేళ మా వినియోగదారులకు ఆనందం అనే వెలుగును ఇవ్వాలని మేం భావించాంమా వినియోగదారులు మాపై ఉంచిన నమ్మకాన్ని మేం గౌరవిస్తున్నాంఈ అదృష్టమైన పండుగ సందర్భంగా వారి వేడుకల్లో ఉత్సాహాన్ని నింపాలనిబహుమతిని అందించాలని మేం ఆశిస్తున్నాం” అని అన్నారు

సీవ్యాపారాలకు సంబంధించిన కాంబో ఆఫర్లు

"ఉన్నతమైన వ్యాపారాలుప్రకాశవంతమైన వేడుకలు"

దీపావళి కేవలం ఇళ్లకు సంబంధించినది మాత్రమే కాదు.. సంస్థలువ్యాపారాలు కూడా విజయాలను వేడుకగా చేసుకునేందుకుఅవి కుటుంబాల మాదిరిగానే బంధాలను ఏర్పరచుకునే సమయం ఇదని బీఎస్ఎన్ఎల్ భావిస్తోందివ్యాపారకార్పోరేట్ వినియోగదారుల కోసం కార్పొరేట్ కాంబో ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ ఆవిష్కరించిందిదీని ప్రకారం ప్రత్యేక పండుగ ధరల్లో మరిన్ని సేవలు పొందొచ్చుకనీసం 10 కొత్త పోస్ట్-పెయిడ్ కనెక్షన్లుఒక ఎఫ్‌టీటీహెచ్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు మొదటి నెల ఎఫ్ఎంసీపై 10 శాతం తగ్గింపు ఉంటుంది

డీఒక రీఛార్జ్‌ను బహుమతిగా ఇవ్వటం

ఒక్కో రీఛార్జితో చిరునవ్వును పంచుదాం”

ఇతరులకు ఇవ్వటంపంచుకోవటం అనే దీపావళి పండుగ నిజమైన స్ఫూర్తికి అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ “ఒక రీఛార్జ్‌ను బహుమతిగా ఇవ్వటం (గిఫ్ట్ ఏ రీఛార్జ్)” అనే సదుపాయాన్ని తీసుకొచ్చిందిఈ ఫీచర్ ద్వారా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు స్నేహితులుకుటుంబ సభ్యులకు ప్రీపెయిడ్ రీఛార్జ్టాప్-అప్‌ను దీపావళి బహుమతిగా ఇవ్వొచ్చువేరే నగరాల్లో నివసిస్తోన్న తల్లిదండ్రులైనా లేదా స్నేహితులను ఆశ్చర్యపరచాలనుకున్నా.. మీరు ఇప్పుడు వారికి టాక్-టైమ్ లేదా డేటాను బహుమతిగా పంపించొచ్చుఇది పండుగల సమయంలో ఇష్టమైన వాళ్లతో కనెక్ట్ అయి ఉండేలా చూసుకుంటుందిఈ బహుమతిని పంపించటం కూడా చాలా సులువుసెల్ప్‌కేర్ యాప్‌ను ఉపయోగించిన ఏదైనా బీఎస్ఎన్ఎల్ ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేయొచ్చుపర్సనల్ మెస్సేజ్‌ కూడా దీనితో పంపించవచ్చు.

అదనపు పండుగ బోనస్‌గా ప్రతి రీఛార్జ్‌పై కొంత అదనపు విలువను బీఎస్ఎన్ఎల్ అందిస్తోందిసద్భావన చిహ్నంగా అందిస్తోన్న ఈ అదనపు విలువ ద్వారా పండుగ తర్వాత కూడా పండుగ ఆనందం కొనసాగుతుందిబహుమతి పొందిన వారు బహుమతి మొత్తంలో 2.5 శాతాన్ని అదనంగా పొందుతారుఈ ఆఫర్ 2025 అక్టోబర్ 18 నుంచి 2025 నవంబర్ 18 వరకు ఉంటుంది

ఈ బహుమతి గురించి శ్రీ ఏరాబర్ట్ జేరవి మాట్లాడుతూ.. “మనకు ఇష్టమైన వారిని చేరుకునేందుకువారితో మాట్లాడేందుకు దీపావళి కంటే మంచి సమయం లేదుమనం స్వీట్లుబహుమతులు పంచుకున్నట్లే.. కమ్యూనికేషన్ బహుమతిని ఇవ్వటాన్ని సులభతరం చేయాలని మేం కోరుకుంటున్నాం. 'ఒక రీఛార్జ్‌ను బహుమతిగా ఇవ్వటం'తో కుటుంబంతో ఫోన్ కాల్ లేదా వీడియో చాట్ చేయటం అనేది ఒక బహుమతిగా ఉంటుందిఇది మైళ్ల దూరంలో ఉన్నప్పుడు కూడా దగ్గరగా ఉన్నారనే భావనను ఇస్తుందిఈ దీపావళికి మీరు పెద్ద వాళ్లకు లేదా స్నేహితులకు రీఛార్జ్ పంపినప్పుడు.. మీరు డేటా లేదా టాక్-టైమ్ ఇచ్చినట్లు మాత్రమే కాదు.. మీరు హృదయపూర్వక సంభాషణను బహుమతిగా ఇస్తున్నారుఈ విలువైన సంభాషణలు మరింత ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవడానికి అదనపు విలువను బీఎస్ఎన్ఎల్ అందించేందుకు సంతోషంగా ఉంది” అని అన్నారు

వయో వృద్ధుల ప్లాన్

బంధాల కలయికతరాల వేడుక”

బాణసంచా కాల్చుతూ కుటుంబ సభ్యుల కలయికలతో దీపావళి చేసుకుంటున్న వేళ మన సమాజంలోని వయోవృద్ధులపై బీఎస్ఎన్ఎల్‌ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందిమనకు జ్ఞానంప్రేమను అందించే వయోవృద్ధుల కోసం దీపావళి బొనాంజాలో భాగంగా ప్రత్యేక వినోదంతో కూడిన వయో వృద్ధుల ప్లాన్‌‌ను (సీనియర్ సిటిజన్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిందిఈ ప్లాన్‌ను 60 ఏళ్లుఅంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారుఇందులో టారిఫ్‌లపై డిస్కాంట్అదనపు ప్రయోజనాలుఎక్కువ సౌలభ్యం అందనున్నాయి

వయోవృద్ధులకు మాత్రమే సంబంధించిన ఈ ప్లాన్ కోసం రూ. 1812 రీఛార్జ్ చేసుకోవాలిదీనివల్ల వచ్చే ప్రయోజనాలు:

రోజుకు 2జీబీ ఇంటర్నెట్ డేటా,
అపరిమిత కాల్స్,
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు,
365 
రోజులు చెల్లుబాటు
ఉచిత సిమ్
బీఐటీవీ ప్రీమియం వినోదం నెలల పాటు ఉచితం

వయోవృద్ధులు తీసుకునే ఈ కొత్త కనెక్షన్ ఆఫర్ 2025 అక్టోబర్ 18 నుంచి 2025 నవంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుంది

దీని గురించి సీఎండీ మాట్లాడుతూ.. “మన గృహాలను వెలుగులతో నింపే దీపం మాదిరిగానే మన పెద్దలు కూడా మన కుటుంబాలకు దారి చూపే దీపం లాంటి వారుఈ దీపావళికి ఎలాంటి చింతా లేని కనెక్టివిటీతో వారి జీవితాలను ప్రకాశవంతం చేయటం ద్వారా వయోవృద్ధులను గౌరవించాలనుకుంటున్నాందూరంగా ఉన్న పిల్లలుమనవరాళ్లతో వయోవృద్ధులను కనెక్ట్ చేయటం ద్వారా మనకు ఎంతో చేసిన తరానికి ధన్యవాదాలు చెప్పే మార్గమే ఈ వయోవృద్ధుల ప్లాన్” అని వ్యాఖ్యానించారు

ఎఫ్ఎంపిక చేసిన ప్లాన్‌లపై పండుగ బోనస్

కొంచెం ఆదాకొంచెం పంచుకోవటం”

ఇతరులకు ఇవ్వటం అనే దీపావళి స్ఫూర్తికి అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్-కేర్ యాప్ లేదా బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ నుంచి చేసే రూ. 485, రూ. 1,999 ప్లాన్ రీఛార్జ్‌లపై శాతం పండుగ ప్రయోజనాన్ని అందిస్తోందిఇది 2025 అక్టోబర్ 18 నుంచి 2025 నవంబర్ 18 వరకు అమలులో ఉంటుంది

ముఖ్య లక్షణాలు:

* 2.5 శాతం తక్షణ డిస్కౌంట్
మిగిలిన 2.5 శాతాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు బీఎస్ఎన్ఎల్ విరాళంగా ఇస్తుందిమరిన్ని జీవితాలను ప్రకాశవంతం చేసేందుకు చిన్న దీపం అనే భావనకు అనుగుణంగా ఇది ఉంది

బీఎస్ఎన్ఎల్ సీఎండీ శ్రీ ఏరాబర్ట్ జేరవి ఈ విధంగా వ్యాఖ్యానించారు:

మనం వెలుగును పంచుకున్నప్పుడు దీపావళి మరింత ప్రకాశవంతంగా మారుతుందిఈ ‘కొంచెం ఆదాకొంచెం పంచుకోవటం’ అనే క్యాంపెయిన్‌తో ప్రతి రీఛార్జ్ ‘ఒకరి సగం చిరునవ్వు కోసం మీ సగం పొదుపు’ అనే ఒక సహృదయ భావనగా మారుతుందిఅందరం కలిసి మరిన్ని ఇళ్లలో మరిన్ని జ్యోతులను వెలిగిద్దాం”

ఈ దీపావళికి కనెక్టివిటీ అనే వెలుగును వ్యాప్తి చేయటం:

దీపావళి బొనాంజా ఆఫర్ల ద్వారా వినియోగదారుల సంతోషండిజిటల్ సమ్మిళితత్వం విషయంలో నిబద్ధతను బీఎస్ఎన్ఎల్ పునరుద్ఘాటిస్తోందిదీపావళి సంస్కృతికి సాంకేతికతతో మెరుగులు దిద్దటం ద్వారా ఈ పండుగ సీజన్‌లో ఇంటి నుంచి దూరంగా ఉన్న విద్యార్థులువ్యాపార సంస్థలు లేదా వయో వృద్ధులు.. ఇలా ఎవరైనా ప్రియమైన వారికి దూరంగా ఉన్నారనే భావన లేకుండా చూసుకోవాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.

దీపపు కాంతుల్లా ఇళ్లనుబంధాలను ప్రకాశింపజేసి సిరి సంపదలు పంచుకోవటం అనే దీపావళి స్ఫూర్తికి అనుగుమంగా ఈ ఆఫర్లు ఉన్నాయి

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులందరితో పాటు దేశ ప్రజలందరికీ దీపావళి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోందిఈ దీపావళి జీవితాలను వెలుగుఆనందంలెక్కలేనన్ని ప్రియమైన కనెక్షన్‌లతో నింపాలని ఆశిస్తోంది

దీపావళి బొనాంజాను పొందడంలో ఏవైనా సందేహాలు ఉన్నాఏదైనా సహాయం కావాలన్నా  సమీపంలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారు సేవా కేంద్రాన్ని (సీఎస్‌సీసందర్శించండి. 1800-180-1503కు ఫోన్ చేయండిలేదా bsnl.co.inని సందర్శించండిఅందరికీ దీపావళి శుభాకాంక్షలు!

 

****


(Release ID: 2180750) Visitor Counter : 6