మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డెహ్రాడూన్‌లో రేపు రాష్ట్రీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమం


పోషకాహారంపై అవగాహనను, సమాజ భాగస్వామ్యాన్ని, ప్రవర్తనా మార్పును ప్రోత్సహించేందుకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రజా ఉద్యమం ముగింపును సూచిస్తున్న కార్యక్రమం

Posted On: 16 OCT 2025 10:05AM by PIB Hyderabad

పోషణ అంటే పౌష్టికాహారం గురించి మాత్రమే కాదు.. అది బలమైనఆరోగ్యకరమైనమరింత సామర్థ్యం కలిగిన భారత్‌ను తయారుచేయడం గురించి కూడాప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్దేశానుసారం ఎనిమిదో పోషణ మాసం (2025 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకునిర్వహించారుఆరోగ్యవంతమైన కుటుంబాలకువికసిత భారత్‌కు మహిళల ఆరోగ్యంపోషకారమే పునాది అని తెలియజేసిన ఈ కార్యక్రమం 2025 సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ప్రారంభమైంది.

ఎనిమిదో రాష్ట్రీయ పోషణ్ మాసం 2025 ముగింపు కార్యక్రమాన్ని రేపు (2025 అక్టోబర్ 17) ఉత్తరాఖండ్‌డెహ్రాడూన్‌లోని హిమాలయన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహిస్తారుఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా మిషన్ సాక్షం అంగన్వాడీపోషన్ 2.0 ద్వారా పోషకాహారంపై అవగాహననుసమాజ భాగస్వామ్యాన్నిప్రవర్తనా మార్పును ప్రోత్సహించేందుకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రజా ఉద్యమం పూర్తవుతుంది.

ఈ కార్యక్రమానికి మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరవుతారుఉత్తరాఖండ్ మహిళా సాధికారతశిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి రేఖా ఆర్యఉత్తరాఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గణేష్ జోషిమహిళాశిశు అభివృద్ధి శాఖకు చెందిన కేంద్రరాష్ట్ర ఉన్నతాధికారులురాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలుసహాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

సమగ్ర ఆరోగ్య పరీక్షలుసేవలకు ప్రాధాన్యమిస్తూ.. మహిళలుచిన్నారుల ఆరోగ్యంపోషణను మెరుగుపరచడంపై దృష్టి సారించి.. ‘‘స్వాస్థ నారీసశక్త పరివార్’’ ఇతివ‌ృత్తంతో దేశవ్యాప్తంగా పోషణ మాసాన్ని నిర్వహించారుదీని ద్వారా చేపట్టిన ప్రధాన కార్యక్రమాలుఊబకాయానికి పరిష్కారంచక్కెరనూనె వినియోగాన్ని తగ్గించడంబాల్య సంరక్షణవిద్య (ఈసీసీఈ), శిశుచిన్నారుల పోషణ (ఐవైసీఎఫ్పద్ధతులుపోషకాహారంలో పురుషుల భాగస్వామ్యంక్షేత్ర స్థాయి సాధికారితస్వావలంబన కోసం ఓకల్ ఫర్ లోకల్కేంద్రీకృత చర్యలుడిజిటలైజేషన్.

కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి నాయకత్వంలో నెల పాటు నిర్వహించిన పోషణ మాసం 2025 కార్యక్రమం ‘‘యావత్ ప్రభుత్వంయావత్ సమాజం’’ అనే స్ఫూర్తితో వివిధ మంత్రిత్వ శాఖలువిభాగాలుసామాజిక సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చిందిసుపోషిత్ భారత్ పౌష్టికమైనఆరోగ్యవంతమైనసాధికారత సాధించిన దేశనే జాతీయ అంకితభావాన్ని గృహ స్థాయి ప్రదర్శనల నుంచి బృహత్ స్థాయిలో నిర్వహించిన ప్రచారాల వరకు చేపట్టిన కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి.

ముగింపు కార్యక్రమంలో సమాజ సమీకరణక్షేత్ర స్థాయి కార్యక్రమాలుపోషకాహారంపై ప్రదర్శనలు ఉంటాయిఅలాగే పోషణ్మిషన్ శక్తి ఛాంపియన్లను సత్కరిస్తారుసుపోషిత్వికసిత్ భారత్ సాధనకు ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపించే సమష్టి కార్యక్రమంగా ఇది నిలిచింది.

 

***


(Release ID: 2179945) Visitor Counter : 9