హోం మంత్రిత్వ శాఖ
గోవా వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ మృతి.. సంతాపం తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ప్రజలకు అంకిత భావంతో అనేక దశాబ్దాల పాటు సేవ చేసినందుకూ, రైతులకు మేలు చేయడానికి తోడ్పాటును అందించినందుకూ రవి నాయక్ జీని స్మరించుకొంటామన్న హోం మంత్రి
प्रविष्टि तिथि:
15 OCT 2025 11:24AM by PIB Hyderabad
గోవా వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ మృతికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తన సంతాపాన్ని తెలిపారు.
శ్రీ అమిత్ షా ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘గోవా వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ ఇక మన మధ్య లేరని తెలిసి, ఎంతో బాధ పడ్డాను. ప్రజలకు అంకిత భావంతో అనేక దశాబ్దాల పాటు సేవ చేసినందుకూ, రైతుల బాగు కోసం తోడ్పడినందుకూ ఆయనను మనం స్మరించుకొంటాం. ఆయన కుటుంబానికీ, ఆయన అనుచరులకూ నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను.’’
***
(रिलीज़ आईडी: 2179278)
आगंतुक पटल : 16