ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి

Posted On: 12 OCT 2025 9:10AM by PIB Hyderabad

రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులు అర్పించారు.

సమాజ సేవకు రాజమాత విజయరాజే సింథియా చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని ప్రధానమంత్రి అన్నారు.

భారతదేశ సాంస్కృతిక మూలలపై విజయరాజే సింథియాకు అపారమైన ప్రేమ ఉండేదని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించటానికిప్రాచుర్యం కల్పించటానికి ఆమె చేసిన నిరంతర కృషి దేశ సంప్రదాయాలువిలువల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానుసమాజ సేవకు ఆమె చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదిజనసంఘ్ నీబీజేపీని బలోపేతం చేయటంలో ఆమె పాత్ర కీలకమైనదిమన సాంస్కృతిక మూలాలపై విజయరాజే సింధియాకు అపారమైన ప్రేమ ఉందివాటిని పరిరక్షించటానికిప్రాచుర్యం కల్పించటానికి ఆమె నిరంతరం కృషి చేశారు”


(Release ID: 2178063) Visitor Counter : 3