యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

22 పతకాలు, 10వ స్థానంతో మన పారా అథ్లెట్లు నవ భారత స్ఫూర్తిని నింపుకున్నారు: డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ మీరు పారా అథ్లెట్లు కాదు.. భారతదేశ పవర్ అథ్లెట్లు: కేంద్ర క్రీడా మంత్రి


మీరు వైకల్యాన్ని దృఢ సంకల్పంగా మార్చారు.. ధైర్యానికి ఇచ్చిన ఈ కొత్త నిర్వచనం

భవిష్యత్ తరాలకు స్ఫూర్తి: డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ

ఈ పతకాలు కేవలం లోహ ప్రతిరూపాలు కాదు.. మీ అచంచలమైన సంకల్పానికి ప్రతీకలు

సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు వీల్‌చైర్లు కూడా రెక్కలుగా మారగలవని మీరు నిరూపించారు: కేంద్ర మంత్రి

ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో రికార్డు స్థాయి పతకాలు సాధించిన భారత్..

పారా అథ్లెట్లను సత్కరించిన కేంద్ర క్రీడా మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ

Posted On: 11 OCT 2025 3:46PM by PIB Hyderabad

ఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌-2025లో పతకాలు సాధించిన భారతదేశ క్రీడాకారుల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడలుకార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఈ రోజు సత్కరించారుఅసాధారణ స్ఫూర్తిదృఢ సంకల్పంతో దేశం గర్వపడేలా రికార్డు స్థాయిలో పతాకాలు సాధించిన క్రీడకారులను ఆయన ప్రశంసించారు.

ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ చరిత్రలో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శనరికార్డు స్థాయిలో 22 పతకాలతో (6 బంగారు, 9 రజత, 7 కాంస్యపతాకాల పరంగా 10వ స్థానంలో నిలిచిందియువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని క్రీడా శాఖ.. పారా అథ్లెట్లకు రూ. 1.09 కోట్లకు పైగా నగదు పురస్కారాలను అందజేసింది.

ఈ సందర్భంగా అథ్లెట్లను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ మనుసుఖ్ మాండవీయ మాట్లాడారు. "మీరు పారా అథ్లెట్లు కాదు.. భారతదేశ పవర్ అథ్లెట్లుపతకాలు సాధించిన మీరు దేశానికి గర్వకారణంముఖ్యంగా దివ్యాంగులకు మీరు ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశం గమనార్హంమీరు చూపిన ఆసక్తి అపారమైనదిఅని వ్యాఖ్యానించారుక్రీడల్లో స్ఫూర్తిధృడత్వం చూపించినందుకు ఆయన క్రీడాకారులను ప్రశంసించారు. " ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారత్‌ ‌దార్శనికతస్ఫూర్తిని ఉత్తమ రీతిలో మీరు నిలబెట్టారుప్రధానమంత్రి మీ మ్యాచ్‌లను టీవీలో చూస్తున్నారుమా సమావేశాల్లో మీ అందరి గురించి అడుగుతూ ఉండేవారుఅని కేంద్ర మంత్రి తెలిపారు

ప్రపంచ స్థాయి పారా-క్రీడలను అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకు అంతర్జాతీయంగా భారత్‌ ప్రశంసలు అందుకుంటోందిఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ పోటీలు జరిగాయిభారత్‌లో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద పారా-క్రీడ కార్యక్రమం ఇదేమొత్తం 186 పతకాలతో కూడిన క్రీడల్లో 100 దేశాలకు చెందిన 2,100 మందికి పైగా పోటీ పడ్డారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐఅధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా మాట్లాడుతూ.. "క్రీడా మంత్రిత్వ శాఖభారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐమాకు ఒక కుటుంబంగా సహాయం చేశాయిఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు డబ్ల్యూపీఏ.. క్రీడల చివరి రోజున మాకు ట్రోఫీని అందించిందిఇలాంటి మరిన్ని క్రీడలను భవిష్యత్తులో ఇక్కడ నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నట్లు వారు చెప్పారుఅథ్లెట్ల సదుపాయాల విషయంలో ప్రమాణాలుక్రీడల సాంకేతిక నిర్వహణ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని ఐపీసీ అధ్యక్షులు ఆండ్రూ పార్సన్స్ప్రపంచ పారా అథ్లెటిక్స్ అధ్యక్షుడు పాల్ ఫ్రిట్జెరాల్డ్ అన్నారుపీసీఐఎస్ఏఐమంత్రిత్వ శాఖల సమష్టి కృషి కారణంగా అంతర్జాతీయ సంస్థల నుంచి ఈ రకమైన ప్రశంసలు అందుతున్నాయిపోటీలు జరిగిన ఏడు రోజుల్లోనే అథ్లెట్లకు నగదు అవార్డులను మంత్రి అందజేసారుఇది క్రీడలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన అద్భుతమైన కృషికి మరో నిదర్శనంగా ఉందిఅని ఝఝారియా అన్నారు.

ఛాంపియన్‌షిప్‌లకు కీలకంగా ఉపయోగపడిన జేఎల్ఎన్ స్డేడియంలోని మోండో ట్రాక్‌ను అథ్లెట్లంతా ఏకగ్రీవంగా మెచ్చుకున్నారు.

"మేమందరం మోండో ట్రాక్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాంఇది వార్మప్‌తో పాటు పోటీ జరిగే ప్రాంతం.. రెండింటిలోనూ ఉందిఅని సుమిత్ అంటిల్ అన్నారు. "దీనితో పాటు హోటళ్లురవాణా కూడా చాలా బాగుందిస్థానిక వాలంటీర్లతో పాటు ఎస్ఏఐపీసీఐ కూడా మాకు చాలా సహాయపడ్డాయిఅని అన్నారు

డబ్ల్యూపీఏసీ- 2025లో భారతదేశానికి తొలి స్వర్ణం సాధించిన శైలేష్ కుమార్ మాట్లాడుతూ.. "ఇది భారతదేశంలో చాలా పెద్ద క్రీడా కార్యక్రమంమొదటి రోజు నేను భయపడ్డాను కానీ ఏర్పాట్లు బాగున్నాయిట్రాక్సొంత స్డేడియం మద్దతు చాలా అనుకూలంగా ఉన్నాయిమోండో ట్రాక్‌తో పాటు సమీపంలోని జిమ్ఫిట్‌నెస్ సెంటర్ కూడా ఉపయోగకరంగా ఉన్నట్లు రుజువైందిఅని వ్యాఖ్యానించారు

మెడికల్ కేంద్రం గురించి డబుల్ మెడలిస్ట్ ప్రీతి పాల్ ప్రస్తావించారు. "మా రేసుల మధ్య స్ప్రింటర్లకు కోలుకునేందుకు మెడికల్ రూమ్ మాకు చాలా సహాయపడిందిముఖ్యంగా ఐస్ బాత్ నిజంగా ప్రయోజనకరంగా ఉందిఅని ఆమె అన్నారు.

పారా అథ్లెట్లు ప్రదర్శించిన మనో ధైర్యాన్ని డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రశంసించారు. 'వైకల్యాన్ని దృఢ సంకల్పంగామార్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. " ధైర్యానికి ఇచ్చిన ఈ కొత్త నిర్వచనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందిమీ విజయాల పట్ల దేశం మొత్తం గర్విస్తోందిమీరు పతకాలు సాధించడమే కాకుండా మా హృదయాలను కూడా గెలుచుకున్నారుసంకల్పం బలంగా ఉన్నప్పుడు వీల్‌చైర్లు కూడా రెక్కలుగా మారగలవని మీరు నిరూపించారుఅని ఆయన వ్యాఖ్యానించారు

 

***


(Release ID: 2178057) Visitor Counter : 10