ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గాజా శాంతి ప్రణాళిక విజయవంతం పట్ల అధ్యక్షుడు ట్రంప్‌ను అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 OCT 2025 9:17PM by PIB Hyderabad

చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ఆయనకు అభినందనలు తెలిపారు.

వారి సంభాషణ సందర్భంగా.. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో సాధించిన సానుకూల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి రాబోయే వారాల్లో మరిన్ని సంప్రదింపులు జరపడానికి వారు అంగీకరించారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"నా స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడి చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం పట్ల ఆయనకు అభినందనలు తెలిపాను. వాణిజ్య చర్చల్లో సాధించిన సానుకూల పురోగతిని కూడా సమీక్షించాం. రాబోయే వారాల్లో మరిన్ని సంప్రదింపులు జరిపేందుకు అంగీకరించాం.

@POTUS 

@realDonaldTrump”


(रिलीज़ आईडी: 2177508) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada