భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులపై చేసే ఏఐ ఆధారిత వీడియోల విషయంలో ఎంసీసీ, ఇతర మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించిన ఈసీఐ

प्रविष्टि तिथि: 09 OCT 2025 10:03AM by PIB Hyderabad

1. 2025 అక్టోబర్ 6న బీహార్ శాసన సభ ఎన్నికలు, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ప్రకటించిన తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీఅమల్లోకి వచ్చిందిఅభ్యర్థులురాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలతో సహా ఇంటర్నెట్‌లో చేసే పోస్టులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి

2. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఇతర పార్టీలపై విమర్శలను.. విధానాలుకార్యక్రమాలలతో పాటు గత పనులురికార్డులకే పరిమితం చేయాలిపార్టీలుఅభ్యర్థులు.. ఇతర పార్టీల నాయకులు లేదా కార్యకర్తల విషయంలో ప్రజా కార్యకలాపాలతో సంబంధం లేని వారి వ్యక్తిగత జీవితంలోని ఏ అంశాన్నీ విమర్శించకూడదు

3. ధ్రువీకరణ లేని ఆరోపణలువక్రీకరణ ఆధారంగా ఇతర పార్టీల లేదా కార్యకర్తలను విమర్శించకూడదు.

4. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న ఈసీఐ.. సామాజిక మాధ్యమాల్లో వాస్తవాల వక్రీకరణతప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే విషయంలో డీప్ ఫేక్‌ను సృష్టించేందుకు ఏఐ సాధనాలను దుర్వినియోగం చేయొద్దని ఎన్నికల సంఘం రాజకీయ నాయకులకు సూచించింది

5. ఏవైనా రాజకీయ పార్టీలువాటి నాయకులుఅభ్యర్థులుస్టార్ క్యాంపెయినర్లు సామాజిక మాధ్యమాల్లో కృత్రిమ కంటెంట్ లేదా ఏఐ తయారు చేసిన కంటెంట్‌ను ప్రచారంలో భాగంగా లేదా ప్రకటనల్లో ఉపయోగించినట్లయితే వాటిపై ‘ఏఐ జనరేటెడ్’, ‘డిజిటల్లీ ఎన్‌‍హ్యాన్స్‌డ్’, ‘సింథటిక్ కంటెంట్’ వంటి స్పష్టమైన లేబుళ్లు ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి

6. ఎన్నికల వాతావరణం చెడి పోకుండా ఉండేందుకు సామాజిక మాధ్యమాలపై నిశిత పర్యవేక్షణ ఉండాలి

7. ఎంసీసీ మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కమిషన్ విస్తృతమైన ఏర్పాట్లు చేసిందిఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటారు

 

***


(रिलीज़ आईडी: 2176630) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam