హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వర్ధంతి: నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
సమాజంలో నిరాదరణకూ, అణచివేతకూ గురైన, వెనుకబడిన తరగతుల వారి ఉద్ధరణ కోసం
జీవితాన్ని అంకితం చేసిన రాం విలాస్ పాశ్వాన్
సామాజిక న్యాయం, సమానత్వాలతో పాటు అణగారిన వర్గాల వారి
హక్కుల సాధనకు విద్యార్థి దశ నుంచే ఎలుగెత్తి నినదించారాయన
రాంవిలాస్ జీ వ్యక్తిత్వం, ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత మనకు గుర్తుంటాయి..
రాంవిలాస్ పాశ్వాన్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నా...
Posted On:
08 OCT 2025 2:09PM by PIB Hyderabad
కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వర్ధంతి ఈ రోజు. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా రాంవిలాస్ పాశ్వాన్ కు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, సమాజంలో నిరాదరణకూ, అణచివేతకూ గురైన వర్గాల వారికీ, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం పాటుపడడానికే రాంవిలాస్ పాశ్వాన్ తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. విద్యార్థిగా ఉన్న కాలం నుంచే, ఆయన సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారు. రాం విలాస్ జీ కరుణామయ వ్యక్తిత్వం, ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని శ్రీ అమిత్ షా అన్నారు. రాంవిలాస్ పాశ్వాన్ గారి వర్ధంతి నాడు ఆయనకు నివాళి అర్పిస్తున్నట్లు శ్రీ షా తెలిపారు.
***
(Release ID: 2176295)
Visitor Counter : 6
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada