కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖఆసియాలోనే ప్రముఖ టెలికాం, సాంకేతిక సదస్సు ఐఎంసీ 2025ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
న్యూఢిల్లీలోని యశోభూమి కేంద్రంలో అక్టోబర్ 8 నుంచి 1 వరకు జరగనున్న ఐఎంసీ 2025
యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 సన్నాహాలను సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
టెలికాం, డిజిటల్ టెక్నాలజీలలో స్వయం సమృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ సాధనకు శక్తిగా నిలవనున్న ‘‘ఆవిష్కరణలతో మార్పు’’ ఇతివృత్తంతో ఐఎంసీ 2025
6జీ వ్యవస్థ, సైబర్ సెక్యూరిటీ, ఉపగ్రహ కమ్యూనికేషన్, కృత్రిమ మేధో, ఐఓసీ టెలికాం తయారీ రంగంపై దృష్టి
1.5 లక్షలకు పైగా సందర్శకులు, 7,000పైగా ప్రపంచ ప్రతినిధులు, 400పైగా ప్రదర్శకులు పాల్గొంటారని అంచనా
5జీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, తదితర రంగాల్లో 1,600పైగా కొత్త టెక్నాలజీ వినియోగ కేసులు
100కిగా పైగా కార్యక్రమాలు, మార్పు తీసుకొచ్చే సాంకేతికతలపై 800కిపైగా ప్రసంగాలు
దేశ డిజిటల్ విజన్, ప్రపంచ నాయకత్వాన్ని వేగవంతం చేసేలా ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025
Posted On:
06 OCT 2025 4:05PM by PIB Hyderabad
‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025’ సదస్సు జరగబోయే ఢిల్లీ ద్వారకాలోని యశోభూమి వేదిక ప్రాంగణాన్ని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా నేడు సందర్శించారు. అక్టోబర్ 8న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్న సందర్భంగా అక్కడ జరుగుతున్న తుది ఏర్పాట్లను మంత్రి సింధియా సమీక్షించారు. కేంద్ర మంత్రి ఢిల్లీలోని శివాజీ స్టేడియం నుంచి విమానాశ్రయ మెట్రో ద్వారా వేదిక వద్దకు వెళ్లారు. తిరిగి మెట్రో ద్వారానే ప్రయాణమయ్యారు.ఈ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ప్రదర్శన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, పాల్గొనబోయే అంకుర సంస్థలు, ప్రదర్శకులతో చర్చించారు. టెలికమ్యూనికేషన్స్ విభాగం, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్య సంస్థల సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాలకు అధ్యక్షత వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఐఎంసీ 2025 ఆశయం, అంతర్జాతీయ ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ సింధియా మాట్లాడుతూ.. ఐఎంసీ 2025 కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి దారితీయనుంది అని పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ 5జీ, కృత్రిమ మేధో, యంత్ర అభ్యాసం, ఐఓటీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ వంటి సాంకేతికతలకు బాట వేస్తుందని ఆయన అన్నారు. ఇది దేశాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచాన్ని భారత్‌తో కలిపే మార్గంగా మారుతుందన్నారు. ఈ దృష్టికోణం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత పదకొండు సంవత్సరాలలో రూపొందించిన వ్యూహాత్మక ప్రణాళికలో భాగమని ఆయన చెప్పారు. దీని ద్వారా ఒక ఆత్మనిర్భర్, శక్తివంతమైన, ఆవిష్కరణలను ప్రేరేపించే భారత్‌ను నిర్మించడం లక్ష్యమన్నారు. ఇది ప్రపంచ పురోగతికి దోహదపడుతుందని తెలిపారు.
4.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన యశోభూమి ప్రాగణంలో ఈ ఏడాది జరగబోయే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 1.5 లక్షలకిపైగా సందర్శకులు, 7,000 ప్రతినిధులు, 150 దేశాల నుంచి ప్రతినిధులు, 400 పైగా ప్రదర్శకులు తమ సాంకేతికతలను ప్రదర్శించబోతున్నారని తెలిపారు. ఐఎంసీ 2025 లో ఆరు ప్రధాన అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు ఉంటాయని, ప్రతి ఒక్కటి డిజిటల్ ఆవిష్కరణల సరిహద్దులను సూచిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. అవి కింది విధంగా ఉన్నాయి.
అంతర్జాతీయ భారత్ 6జీ సింపోజియం– భారత్ 6జీ అలయన్స్ ఆధ్వర్యంలో 6జీ పరిశోధనలో దేశ నాయకత్వాన్ని ప్రదర్శించనుంది.
అంతర్జాతీయ ఏఐ సదస్సు– వ్యవస్థలు, సేవలపై కృత్రిమ మేధో చూపిస్తున్న ప్రభావంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.
సైబర్ సెక్యూరిటీ సదస్సు – 1.2 బిలియన్ టెలికాం వినియోగదారుల డేటా భద్రత, డిజిటల్ మౌలిక వసతుల రక్షణపై చర్చ జరగనుంది.
శాట్కామ్ సదస్సు – శాటిలైట్ కమ్యూనికేషన్, నియంత్రణ విధానాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై దృష్టి·
ఐఎంసీ లక్ష్యంగా కార్యక్రమం – సుమారు 500 అంకుర సంస్థలు, 300 పెట్టుబడి సంస్థలు, బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలను కలిపే వేదిక·
అంతర్జాతీయ అంకుర సంస్థల ప్రపంచ కప్ – ఇండియా చాప్టర్ – 1 మిలియన్ డాలర్ల బహుమతికి 15 ఫైనలిస్టులు పోటీపడేలా ప్రపంచ స్థాయి పోటీ
ఈ కార్యక్రమాలన్నీ ఐఎంసీ 2025ను ప్రపంచ ఆలోచనల, సాంకేతికతల, పెట్టుబడుల సంగమంగా మలుస్తాయని కేంద్రమంత్రి శ్రీ సింధియా తెలిపారు. భారత టెలికాం, డిజిటల్ ప్రగతిని నిర్వచించే ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని చెప్పారు.
టెలికాం రంగంలో దేశం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ.. 1.2 బిలియన్ మొబైల్ సబ్‌స్క్రైబర్లు, 970 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ విస్తరణతో, కేవలం 22 నెలల్లోనే ఎదిగిన ప్రపంచంలోని అత్యుత్తమ మూడు డిజిటల్ దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి శ్రీ సింధియా అన్నారు.
“భారతదేశంలోనే డిజైన్ చేయడం, ఇక్కడే పరిష్కరించడం, ఇవన్నింటినీ విశ్వవ్యాప్తంగా విస్తరించగలగడమే మన బలం ఉంది. ఐఎంసీ 2025 ఈ సాంకేతిక స్వావలంబన, ఆవిష్కరణల ప్రయాణాన్ని ఘనంగా జరుపుకుంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారకలోని యశోభూమిలో అక్టోబర్ 8, 2025న ఉదయం 9:30 గంటలకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025ను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి ప్రకటించారు. ‘‘గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ టెలికాం రంగం ఆవిష్కరణకు, కనెక్టివిటీకి, సమగ్రతకు ఒక ఆదర్శంగా మారిందని తెలిపారు. ఐఎంసీ 2025 ద్వారా దేశ డిజిటల్ పరివర్తనను ప్రపంచానికి చూపించే వేదికగా నిలుస్తుంది’ అని అన్నారు.
****
(Release ID: 2175852)
Visitor Counter : 4