ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బోడోలాండ్ ప్రాంతీయ మండలి ప్రధాన కార్యనిర్వహక సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ హగ్రామ మొహిలరీను అభినందించిన ప్రధాని

Posted On: 05 OCT 2025 4:14PM by PIB Hyderabad

బోడోలాండ్ ప్రాంతీయ మండలి ప్రధాన కార్యనిర్వహక సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ హగ్రామ మొహిలరీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. 

బోడోలాండ్ ప్రాంతీయ మండలి (బీటీసీ) ప్రధాన కార్యనిర్వహక సభ్యునిగా (సీఈఎం) ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ హగ్రామ మొహిలరీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. బీటీసీ పరిపాలన యంత్రాంగానికి కేంద్ర, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఉంటుందని మోదీ పునరుద్ఘాటించారు. గౌరవనీయులైన బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ దార్శనికతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

"బోడోలాండ్ ప్రాంతీయ మండలి సీఈఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు శ్రీ హగ్రామ మొహిలరీకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన, ఆయన బృంద పదవీకాలం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ దార్శనికతను నెరవేర్చడానికి, సర్వతోముఖాభివృద్ధిని అందించేందుకు మనమందరం కలిసి పనిచేస్తున్నందున.. కేంద్ర, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు.. బీటీసీ పరిపాలన యంత్రాంగానికి మద్దతునిస్తూనే ఉంటాయి“


(Release ID: 2175095) Visitor Counter : 3