రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 01 OCT 2025 6:32PM by PIB Hyderabad

గాంధీ జయంతి సందర్భంగా ఇచ్చిన సందేశంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ విధంగా వ్యాఖ్యానించారు:

జాతిపిత మహాత్మా‌గాంధీ 156వ జయంతి సందర్భంగా ప్రజలందరి తరఫున ఆయనకు నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను.

జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాలువిలువలకు మనల్ని మనం అంకితం చేసుకునే సందర్భం ఇది.

గాంధీజీ శాంతిసహనంసత్యం అనే సందేశాన్ని ఇచ్చారుఇవి మానవాళి మొత్తానికి ప్రేరణ కలిగించాయిఅంటరానితనంనిరక్షరాస్యతవ్యసనంఇతర సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారుఅచంచలమైన దృఢ సంకల్పంతో సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలిచి వారికి బలాన్నిచ్చారు.

ఆయన జీవితం మొత్తం నైతికతనీతి పట్ల అచంచలమైన నమ్మకంతో ఉన్నారుప్రజలను ఈ మార్గంలో నడిచేందుకు ప్రేరణనిచ్చారుస్వావలంబనస్వయం సమృద్ధివిద్యావంతులతో ఉన్న భారత్‌ను తయారుచేయాలనే లక్ష్యంతో చరఖాను ఉపయోగించి స్వావలంబన సందేశాన్ని ఇచ్చారుప్రవర్తనబోధనల ద్వారా ఆయన ఎల్లప్పుడూ శ్రమ పట్ల గౌరవాన్ని పెంపొందించారుఆయన జీవిత విలువలు నేటికీ సముచితంగా ఉండటంతో పాటు భవిష్యత్తులో మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి.

గాంధీ జయంతి శుభ సందర్భంగా సత్యంఅహింస మార్గాన్ని అనుసరించరిస్తూ దేశ సంక్షేమంపురోగతికి కట్టుబడి ఉండటం.. పరిశుభ్రమైనమరింత సమర్థవంతమైనపూర్తి సాధికారత కలిగిన సుసంపన్న భారత్‌ను తయారుచేయాలనే గాంధీజీ కలను సాకారం చేస్తామని మరోసారి సంకల్పించుకుందాం”.

 

***


(रिलीज़ आईडी: 2174135) आगंतुक पटल : 104
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Malayalam