ప్రధాన మంత్రి కార్యాలయం
విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి
Posted On:
02 OCT 2025 7:37AM by PIB Hyderabad
విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వేర్వేరు పోస్టుల్లో ఈ విధంగా పేర్కొన్నారు:
"చెడు,అసత్యాలపై మంచి, ధర్మం సాధించిన విజయాన్ని విజయదశమి తెలియజేస్తోంది. ధైర్యం, జ్ఞానం, భక్తి ఎల్లప్పుడూ మన మార్గాలను నిర్దేశించాలని కోరుకుంటున్నాను.
నా తోటి భారతీయులకు విజయ దశమి శుభాకాంక్షలు."
" చెడు, అసత్యంపై మంచి, సత్యం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ సాహసం, జ్ఞానం, భక్తి మార్గంలో కొనసాగేందుకు ప్రేరణ పొందాలని నేను కోరుకుంటున్నాను.
దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు."
(Release ID: 2174130)
Visitor Counter : 3
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam