ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 25 FEB 2024 7:45PM by PIB Hyderabad

భారత్‌ మాతాకీ జై!

భారత్‌ మాతాకీ జై!

వేదికపై ఆసీనులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయభారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులుపార్లమెంటులో నా సహచరులైన శ్రీ సి.ఆర్.పాటిల్ఇతర ప్రముఖులతోపాటు రాజ్‌కోట్‌లోని నా సోదరీసోదరులందరికీ నమస్కారం!

వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నేటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా మనతో మమేకమైన గౌరవనీయ గవర్నర్లుముఖ్యమంత్రులుకేంద్ర మంత్రులుఎంపీలుఎమ్మెల్యేలు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

జాతీయ స్థాయి కీలక కార్యక్రమాలన్నీ ఒకనాడు దేశ రాజధాని ఢిల్లీకే మాత్రమే పరిమితంగా ఉండేవి. అయితేరాజ్‌కోట్‌లో నేటి కార్యక్రమం సహా కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలను వికేంద్రీకరించిదేశం నలుమూలలకూ తీసుకొచ్చానుఅనేక నగరాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంశంకుస్థాపన వేడుకను ఏకకాలంలో నిర్వహించే ఓ కొత్త సంప్రదాయాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుందికొన్ని రోజుల కిందట నేను జమ్మూకాశ్మీర్‌లో పర్యటించాను... జమ్మూ నుంచి ఏకకాలంలో “భిలాయ్తిరుపతి నగరాల్లో ‘ఐఐటీ’లుకర్నూల్‌లో ఐఐఐటీబోధ్‌గయజమ్మూవిశాఖపట్నం నగరాల్లో ‘ఐఐఎం’లుకాన్పూర్‌లో ఐఐఎస్‌” వంటి వివిధ విద్యా ప్రాంగణాలను ప్రారంభించానుఅదే తరహాలో నేడు ఇక్కడి నుంచి రాజ్‌కోట్రాయ్‌బరేలీమంగళగిరిభటిండాకల్యాణి నగరాల్లో ‘అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థల (ఏఐఐఎంఎస్‌-ఎయిమ్స్‌)ను ఒకేసారి ప్రారంభించానుసమగ్రాభివృద్ధి సహా దేశం శరవేగంగా పురోగమించడంపై మా నిబద్ధతను ఇవన్నీ ప్రతిబింబిస్తాయి.

మిత్రులారా!

నేనివాళ రాజ్‌కోట్‌కు వచ్చిన సందర్భంగా ఇక్కడి చాలా జ్ఞాపకాలు మదిలో మెదలుతున్నాయి. నిన్నటి రోజు నా జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతుందినా రాజకీయ ప్రయాణంలో 22 ఏళ్ల కిందట ఫిబ్రవరి 24న ఈ నగరం నన్ను తొలిసారి శాసనసభకు తన ప్రతినిధి (ఎమ్మెల్యే)గా పంపిందిరాజ్‌కోట్‌ ప్రజల ఆశీర్వాదంతో మరునాడు.. అంటేఫిబ్రవరి 25న నేను గాంధీనగర్‌లోని శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశానుఈ నగర ప్రజల అవ్యాజానురాగంనమ్మకాలకు నేనెంతో రుణపడి ఉన్నానుఇప్పుడు 22 ఏళ్ల తర్వాత శక్తివంచన లేకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేశానని సగర్వంగా చెప్పగలను.

యావద్దేశం ఇప్పుడు నాపై అపార ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఆశీర్వదిస్తోంది. నాకు లభిస్తున్న ఈ గుర్తింపులో రాజ్‌కోట్ నగరానికీ సముచిత భాగం ఉందిఈ సందర్భంగా- ‘అబ్‌ కీ బార్‌ 400 పార్’పై అపూర్వ విశ్వాసంతో ‘ఎన్‌డీఏ’ ప్రభుత్వం వరుసగా మూడోసారి దేశవ్యాప్త ఆమోదం పొందిన నేపథ్యంలో రాజ్‌కోట్‌లోని ప్రతి ఒక్కరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానుతరాలు మారవచ్చుగానీవయసుతో నిమిత్తం లేకుండా మోదీపై అభిమానం వెల్లువెత్తుతుందని స్పష్టమవుతోందిఈ అవధులెరుగని ప్రేమను నేనొక రుణంగా పరిగణిస్తూఅందరి ప్రగతికీ కృషి చేయడం ద్వారా దాన్ని వడ్డీతో చెల్లించే ప్రయత్నం చేస్తాను.

మిత్రులారా!

ఇక్కడకు రావడంలో ఆలస్యమైనందుకు, నాకోసం వేచి ఉండేలా చేసినందుకు మీకందరికీవివిధ రాష్ట్రాల గౌరవనీయ ముఖ్యమంత్రులకుపౌరులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానుఅయితేనేను ద్వారకకు వెళ్లడమే ఈ జాప్యానికి కారణంఅక్కడ ద్వారకాధీశుని ఆశీస్సులు కోరుతూ ప్రార్థించిద్వారక-బేట్ ద్వారకలను కలిపే సుదర్శన్ వంతెనను ప్రారంభించానుద్వారకకు సేవ చేయడంలో ఈ సందర్శన నాకు తోడ్పడటమేగాక ప్రగాఢ ఆధ్యాత్మిక అనుభవాన్నిచ్చిందిశ్రీ కృష్ణుడు స్వయంగా నిర్మించినదిగా చరిత్ర చెబుతున్న ద్వారకఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిందిఆ ప్రాచీన నగర అవశేషాలను నీటి అడుగున చూడగలగటంనివాళి అర్పించడంశ్రీ కృష్ణుడి ఆరాధనలో కొద్దిసేపు తాదాత్మ్యం చెందడం ఈ రోజు నాకు లభించిన దివ్యానుభూతినా ఈ చిరకాల ఆకాంక్ష చివరకు ఇలా నెరవేరిందిప్రాచీన గ్రంథాలుపురావస్తు ఆవిష్కరణల ద్వారా ద్వారక గురించి తెలుసుకోవడం నన్ను సదా విస్మయానికి గురిచేస్తుందిసముద్ర గర్భంలో కలిసిన ఆ పవిత్ర ప్రదేశాలను స్పర్శించిన క్షణంలో నాలో భావోద్వేగం రగిలిందికృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలతోపాటు నెమలి ఈకలను కూడా సమర్పించానునేను సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తున్నపుడు సుసంపన్న భారతీయ వారసత్వందాని అద్భుత పురోగమనం గురించి ఆలోచించానుసముద్రం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుని ఆశీర్వాదాలను మాత్రమేగాక ద్వారక నుంచి పావన స్ఫూర్తిని కూడా నాతో తెచ్చానువారసత్వ పరిరక్షణతోపాటు అభివృద్ధిపై నా నిబద్ధతకు నేడు పునరుత్తేజం లభించిందివికసిత భారత్‌ రూపకల్పన సంకల్పానికి పవిత్ర విశ్వాసం తోడైంది.

మిత్రులారా!

ఈ రోజున రూ.48 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంశంకుస్థాపన చేయడాన్ని మీతోపాటు యావద్దేశం చూసిందిగుజరాత్ నుంచి హర్యానాలోని చమురుశుద్ధి కర్మాగారానికి నేరుగా ముడి చమురు సరఫరా కోసం ముంద్రా-పానిపట్ కొత్త పైప్‌లైన్ ప్రాజెక్టుకు పునాది వేశాందీంతోపాటు రాజ్‌కోట్‌ సహా సౌరాష్ట్ర ప్రాంతమంతటికీ అనేక సౌకర్యాలు విస్తరించాయివీటిలో రహదారులువంతెనలురైలుమార్గాల డబ్లింగ్విద్యుత్తుఆరోగ్య సంరక్షణవిద్యా రంగాల ప్రాజెక్టులున్నాయిఅంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత రాజ్‌కోట్ ఇప్పుడు ‘ఎయిమ్స్‌’ను సొంతం చేసుకోవడం ఓ కీలక ఘట్టంరాజ్‌కోట్సౌరాష్ట్ర సహా గుజరాత్‌లో ఇవాళ ‘ఎయిమ్స్‌’ ప్రారంభమయ్యే ప్రాంతాల ప్రజలందరికీ ఈ సందర్భంగా నా శుభాభినందనలు.

మిత్రులారా!

రాజ్‌కోట్, గుజరాత్‌లకు మాత్రమేగాక దేశం మొత్తానికీ ఈ రోజు ఒక చారిత్రక సంఘటనను సూచిస్తుందివికసిత భారత్‌లో ఆరోగ్య సంరక్షణకు ఓ నిర్దిష్ట ప్రమాణంతో ప్రపంచ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్య రంగం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాంస్వాతంత్య్రం వచ్చిన 50 ఏళ్ల తర్వాత కూడా ఢిల్లీలో మాత్రమే… అదీ ఒకేఒక ‘ఎయిమ్స్’ ఉండేదిమరికొన్నిటి నిర్మాణానికి అనుమతులుఆమోదాలు ఉన్నప్పటికీ అవి అసంపూర్ణంగా మిగిలిపోయాయిఈ నేపథ్యంలో కేవలం గత పది రోజుల్లోనే, 7 కొత్త ‘ఎయిమ్స్‌’కు మేం శంకుస్థాపన చేశాంకాబట్టేగడచిన 6-7 దశాబ్దాల కాలంతో పోలిస్తే అనేక రెట్లు వేగంగా మేం దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామనిప్రజల సంక్షేమానికి నిబద్ధతతో ఉన్నామని నేను చెప్పగలనుఇదే సందర్భంలో 23 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో 200కుపైగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేశాంవీటిలో తీవ్ర అనారోగ్యానికి చికిత్స చేసే వైద్య కళాశాలలుప్రధాన ఆసుపత్రుల ఉప కేంద్రాలు కూడా ఉన్నాయి.

మిత్రులారా!

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్లనే మోదీ హామీపై దేశంలో విశ్వాసం ఇనుమడించింది. ‘ఎయిమ్స్’ ఆస్పత్రుల ప్రారంభమే ఇందుకు తిరుగులేని నిదర్శనంరాజ్‌కోట్‌లో తొలి ‘ఎయిమ్స్‌’ ఏర్పాటుపై ఇచ్చిన హామీ మేరకు మూడేళ్ల కిందట పునాది రాయి వేశానుఇప్పుడు దాన్ని ప్రారంభించడం ద్వారా నా వాగ్దానం నెరవేర్చానుపంజాబ్‌ రాష్ట్రానికీ ఇదే హామీ ప్రకారం శంకుస్థాపన చేయగాఇప్పుడు భటిండాలో ‘ఎయిమ్స్‌’ను ప్రారంభించి మీ ‘సేవకుడు’ తన మాట నిలబెట్టుకున్నాడుఅదేవిధంగా ఐదేళ్ల కిందటి హామీని నెరవేరుస్తూ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో ‘ఎయిమ్స్’ను ప్రారంభించానుకాంగ్రెస్ రాజ కుటుంబం రాయబరేలీలో రాజకీయాల్లో మునిగితేలితేమోదీ వాస్తవంగా చేయాల్సిన పనులు చేశాడుమరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణిఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో కూడా ‘ఎయిమ్స్’ను ప్రారంభించిమా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాంకొద్ది రోజుల కిందట… ఫిబ్రవరి 16న హర్యానాలోని రేవారీలో ‘ఎయిమ్స్‌’కు శంకుస్థాపన చేసిమరో హామీ నెరవేర్చానుమొత్తంమీద గత దశాబ్ద కాలంలో మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 కొత్త ‘ఎయిమ్స్‌’ నిర్మాణానికి ఆమోదం ఇవ్వడం ద్వారా ఆధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాన్ని ప్రజలకు చేరువ చేసిందివివిధ రాష్ట్రాల ప్రజలు ‘ఎయిమ్స్‌’ కోసం ఏళ్ల తరబడి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ విసిగిపోయారుఅయితేనేడు ‘ఎయిమ్స్’ వంటి అనేక ఆధునిక ఆసుపత్రులతోపాటు వైద్య కళాశాలలు వరుసగా ప్రారంభం అవుతున్నాయిఇతరులు ఎక్కడ విఫలమయ్యారోఅక్కడ మోదీ  హామీ నెరవేరుతుందనే రికార్డును ఈ ప్రగతి పునరుద్ఘాటిస్తుంది.

మిత్రులారా!

కరోనా మహమ్మారిపై పోరులో భారత్‌ విజయం సాధించడం ఇవాళ ప్రపంచవ్యాప్త చర్చనీయాంశంగా ఉంది. గత దశాబ్దంలో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రగతిశీల పరిణామమే ఈ విజయానికి కారణమని చెప్పవచ్చుఈ కాలంలోనే ‘ఎయిమ్స్‌’తోపాటు వైద్య కళాశాలలుఅత్యవసర వైద్య మౌలిక సదుపాయాలు అసాధారణ రీతిలో విస్తరించాయిసాధారణ వ్యాధులకు చికిత్స కోసం ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌’ పేరిట ప్రతి గ్రామంలో ఒకటి వంతున 1.5 లక్షలకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేశాందశాబ్దం కిందటితో పోలిస్తే ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు గణనీయంగా పెరిగాయిపదేళ్లకు ముందు దేశంలో వైద్య కళాశాలల సంఖ్య సుమారు 380-390 కాగాఇవాళ 706కు పెరిగిందిఅలాగే ఎంబీబీఎస్‌ సీట్లు సుమారు 50 వేల నుంచి లక్షకుపైగా పెరిగాయిఅదేవిధంగాపోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్లు సుమారు 30 వేల నుంచి 70 వేలకుపైగా పెరిగాయిప్రస్తుత అదనపు సదుపాయాల ఫలితంగా కొన్నేళ్లలోనే కొత్త డాక్టర్ల సంఖ్య స్వాతంత్ర్యం తర్వాత 70 ఏళ్లలో వైద్య కళాశాలల నుంచి వచ్చిన యువ వైద్యుల సంఖ్యను మించిపోగలదువీటన్నిటితోపాటు దేశవ్యాప్తంగా రూ.64 వేల కోట్లతో ‘ఆయుష్మాన్ భారత్ మౌలిక సదుపాయాల కార్యక్రమం’ ఇప్పుడు  కొనసాగుతోందిఈ నేపథ్యంలో ఇవాళ అనేక వైద్య కళాశాలలుఆస్పత్రులుక్షయ చికిత్స కోసం పరిశోధన కేంద్రాలు, ‘పీజీఐ’ ఉప కేంద్రాలుఅత్యవసర చికిత్స విభాగాలు సహా అనేక ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపనప్రారంభోత్సవం చేశాంఅంతేగాక ఆయా రాష్ట్రాలకు ‘ఇఎస్‌ఐసీ’ ఆస్పత్రులను అప్పగించాం.

మిత్రులారా!

దేశవ్యాప్తంగా వ్యాధి నివారణ-నిరోధక సామర్థ్యాలను పెంచడంపైనా మా ప్రభుత్వం దృష్టి సారించిందిఇందులో భాగంగా సంప్రదాయఆధునిక వైద్య విధానాలు రెండింటినీ ప్రోత్సహిస్తున్నాంపోషకాహారంయోగా-ఆయుష్పరిశుభ్రత వంటి రోగ నివారణ అంశాలకు ప్రాధాన్యమిచ్చాంఈ దిశగా మహారాష్ట్రహర్యానా రాష్ట్రాల్లో యోగాప్రకృతి వైద్యం కోసం రెండు ప్రత్యేక ఆస్పత్రి-పరిశోధన కేంద్రాలను ప్రారంభించాంఇక సంప్రదాయ వైద్య విధానాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుజరాత్‌లో అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

మిత్రులారా!

దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలకు పొదుపు సొమ్ము కోల్పోకుండా మెరుగైన ఆరోగ్య సంరక్షణ లభించేలా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందిదీంతో ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ద్వారా పేదలకు రూ.లక్ష కోట్ల దాకా ఆదా అయిందిజనౌషధి కేంద్రాల ద్వారా దాదాపు 80 శాతం తగ్గింపు ధరతో నాణ్యమైన మందులు కూడా లభిస్తున్నందున పేదలు-మధ్యతరగతి వారికి మరో రూ.30 వేల కోట్ల వ్యయం తగ్గిందిఈ విధంగా ప్రభుత్వం ప్రాణరక్షణకు చేయూతనివ్వడమే కాకుండా వారిపై ఆర్థిక భారాన్ని కూడా తగ్గించిందిఇక ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు రూ.70 వేల కోట్లకుపైగా ఆదా అయిందిమా ప్రభుత్వం చౌకధరతో డేటాను అందించడం వల్ల మొబైల్ వినియోగదారులకు ప్రతి నెలా దాదాపు రూ.4000 ఆదా అవుతోందిఅలాగే పన్ను సంస్కరణలతో చెల్లింపుదారులకు దాదాపు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అయ్యాయి.

మిత్రులారా!

భవిష్యత్తులో పేద, మధ్యతరగతి కుటుంబాల పొదుపును మరింత పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం మరొక పథకాన్ని ప్రవేశపెట్టిందిఈ మేరకు ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజనకింద ఇంట్లో విద్యుదుత్పత్తి ద్వారా బిల్లులు సున్నా స్థాయికి తగ్గడంతోపాటు గృహాలకు ఆదాయం కూడా సమకూరుతుందిఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రజలందరికీ పొదుపుఆదాయార్జనలో తోడ్పడాలన్నది మా ధ్యేయంఈ పథకం కింద లబ్ధిదారులకు 300 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్తు లభిస్తుందిదీనికి మించి ఉత్పత్తయ్యే విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.

మిత్రులారా!

ప్రతి కుటుంబానికి సాధికారత ద్వారా సౌర విద్యుదుత్పత్తిదారుగా మార్చేందుకు మేం కృషి చేస్తున్నాం. దీంతోపాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సౌరపవన విద్యుత్‌ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాంఇందులో భాగంగా ఇవాళ కచ్‌లో సౌరఒక పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాంతద్వారా గుజరాత్‌ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం మరింత ఇనుమడిస్తుంది.

మిత్రులారా!

స్వయంసమృధ్ధ భారత్‌ను సాకారం చేయడంలో రాజ్‌కోట్‌లోని మన వ్యవస్థాపకులు, కార్మికులుచేతివృత్తులవారు కీలక పాత్ర పోషించగలరుమునుపటి పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన వీరిలో అధికశాతానికి మోదీ పాలనలో తొలిసారి గుర్తింపుచేయూత లభిస్తున్నాయిదేశ చరిత్రలో మొదటిసారి మన విశ్వకర్మ మిత్రుల కోసం జాతీయ స్థాయిలో రూ.13వేల కోట్లతో ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ రూపొందించాందీనికింద ఇప్పటిదాకా లక్షలాది మంది నమోదైన నేపథ్యంలో వారందరికీ రూ.15,000 వంతున ఆర్థిక సహాయం లభిస్తుందిఈ పథకం పరిధిలో నిర్వహించే కార్యక్రమాల ద్వారా నైపుణ్యం పెంచుకునివృత్తులు-వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం వారికి లభిస్తుందిఈ మేరకు ఒక్క గుజరాత్‌లోనే 20 వేల మందికిపైగా శిక్షణ పొందారు.

మిత్రులారా!

రాజ్‌కోట్‌లో సోనార్ (స్వర్ణకారసమాజం పాత్ర ఎంత కీలకమైనదో మీకందరికీ తెలుసు... ఈ వృత్తిలో ఉన్నవారు కూడా విశ్వకర్మ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు.

మిత్రులారా!

దేశంలోని వీధి వ్యాపారులకు చేయూత కోసం తొలిసారి ‘పీఎం స్వానిధి’ పథకం ప్రవేశపెట్టాం. దీనికింద  ఇప్పటిదాకా సుమారు రూ.10 వేల కోట్ల మేర వారికి ఆర్థిక సహాయం అందించగాగుజరాత్‌లోని వీధి వ్యాపారులు రూ.800 కోట్లదాకా లబ్ధిపొందారుఒక్క రాజ్‌కోట్‌లోనే 30 వేలకుపైగా రుణాలు వారికి పంపిణీ అయ్యాయిగతంలో అణచివేతకు గురైన వీధి వ్యాపారులు ఇప్పుడు బీజేపీ హయాంలో ఆత్మగౌరవంతో జీవిస్తుండటం గమనార్హం.

మిత్రులారా!

దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలకు సాధికారత కల్పన ద్వారా వికసిత భారత్ సంకల్పం మరింత బలోపేతం అవుతుంది. భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దాలని మోదీ ప్రతినబూనిన నేపథ్యంలో ఆరోగ్యం-శ్రేయస్సుపై అందరికీ భరోసా ఇవ్వాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నాడుదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ దిశగా మా నిబద్ధతను మరింత పటిష్ఠం చేస్తాయిఈ ఆకాంక్షతోనే విమానాశ్రయంలో మాకు మీ నుంచి సాదర స్వాగతం లభించిందిచాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు చాలామంది పాత సహచరులను పలకరించే అవకాశం లభించడం నాకెంతో సంతోషంగా ఉందిఈ సందర్భంగా రాజ్‌కోట్‌లోని బీజేపీ సహచరులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానుఇటువంటి విశిష్ట కార్యక్రమాలతోపాటు వికసిత భారత్ సంకల్ప సాకారం కోసం మనమంతా సమష్టిగా ముందడుగు వేద్దాంమీకందరికీ మరోసారి నా అభినందనలుచివరగాదేశం నలుమూలలకూ వినిపించేలా మీరందరూ నాతో గొంతు కలపండి:

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

అనేకానేక ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

****


(रिलीज़ आईडी: 2171110) आगंतुक पटल : 40
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam