ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
బీహార్‌లోని భక్తియార్‌పూర్ - రాజ్‌గిర్ - తిలైయ్య సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ ను (104 కి.మీ)
రూ. 2,192 కోట్ల వ్యయంతో డబ్లింగ్ చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Posted On:
24 SEP 2025 3:05PM by PIB Hyderabad
బీహార్‌లోని భక్తియార్‌పూర్ - రాజ్‌గిర్ - తిలైయ్య సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ ను డబ్లింగ్ చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. 104 కిలోమీటర్ల పొడవున్న ఈ రైల్వే లైను ప్రాజెక్టును రూ. 2,192 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.
బీహార్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలను కవర్ చేస్తూ చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్.. భారతీయ రైల్వే ప్రస్తుత పరిధిని సుమారు 104 కిలోమీటర్ల మేర విస్తరించనుంది.
ఈ ప్రాజెక్ట్ విభాగం రాజ్‌గిర్ (శాంతి స్థూపం), నలందా, పవపురి వంటి ప్రముఖ ప్రాంతాలను రైల్వే వ్యవస్థతో అనుసంధానం చేస్తుంది. ఇది దేశం నలుమూలల నుంచి యాత్రికులు, పర్యాటకులను ఆకర్షించనుంది.
ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు సుమారు 1,434 గ్రామాలు, 13.46 లక్షల జనాభా, రెండు ఆకాంక్షాత్మక జిల్లాలకు (గయా, నవాడా) ప్రయోజనం చేకూర్చనున్నాయి.
బొగ్గు, సిమెంట్, క్లింకర్, ఫ్లై యాష్ వంటి సరకు రవాణాకు ఇది ఒక ముఖ్యమైన మార్గం. వీటి సామర్థ్యాన్ని పెంచే పనుల వల్ల ప్రతి సంవత్సరం 26 మిలియన్ టన్నుల అదనపు సరకు రవాణా జరగనుంది. పర్యావరణ అనుకూలమైన, ఇంధన సామర్థ్యం కలిగిన రవాణా విధానం ద్వారా.. దేశంలో రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు సుమారు 5 కోట్ల లీటర్ల చమురు దిగుమతిని తగ్గించవచ్చు. 24 కోట్ల కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కోటి మొక్కలు నాటడానికి సమానంగా పర్యావరణానికి లాభం చేకూర్చుతుంది.
పొడిగించబోయే రైల్వే లైన్ ద్వారా రవాణా సామర్థ్యం మెరగవుతుంది. భారతీయ రైల్వేల సామర్థ్యాన్ని, సేవా విశ్వసనీయతను పెంచుతుంది. ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రణాళికతో రవాణా కార్యకలాపాలు సులభతరం అవడమే కాకుండా రద్దీ తగ్గనుంది. దీని ద్వారా భారతీయ రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే విభాగాలలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుంది.
ఈ ప్రాజెక్టులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నూతన భారత్’ దృష్టి కోణానికి అనుగుణంగా రూపొందాయి. వీటి ద్వారా ప్రాంతీయ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తుంది. స్థానికులకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. బహుళ రవాణా మార్గాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడం, రవాణా సామర్థ్యాన్ని, సమర్థతను పెంచడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. సమగ్ర ప్రణాళిక, సంబంధిత భాగస్వాములతో సంప్రదింపుల ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రజలు, సరకులు, ప్రయాణికుల రవాణాకు అధిక కనెక్టివిటీ లభిస్తుంది. ఆర్థిక, వాణిజ్య అభివృద్ధికు బలమైన మౌలిక సదుపాయాల మద్దతు ఏర్పడుతుంది.
***
(Release ID: 2170677)
Visitor Counter : 6
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada