ప్రధాన మంత్రి కార్యాలయం
అధికారిక కార్యక్రమాల్లో పొందిన బహుమతుల ఆన్ లైన్ వేలంలో పాల్గొనాలని దేశ ప్రజలకు ప్రధాని ఆహ్వానం
Posted On:
24 SEP 2025 1:09PM by PIB Hyderabad
తన అధికారిక కార్యాక్రమాలు, సమావేశాల సందర్భంగా స్వీకరించిన బహుమతుల వేలం ప్రారంభమయ్యిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ వేలంలో పౌరులు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు. గంగా నది సంరక్షణ, పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకం- నమామి గంగే.
సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్ ’ పోస్టులో మోదీ ఇలా పేర్కొన్నారు.
‘గత కొన్ని రోజులుగా నేను వివిధ కార్యక్రమాలలో స్వీకరించిన బహుమతుల కోసం ఆన్ లైన్ వేలం జరుగుతోంది. ఈ వేలంలో మన సంస్కృతి, సృజనాత్మకతను ప్రతిబింబించే ఆసక్తికరమైన కళాఖండాలు ఉన్నాయి. వేలం ద్వారా వచ్చిన ఆదాయం నమామి గంగే కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ వేలంలో తప్పకుండా పాల్గొనండి.’’
(Release ID: 2170579)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam