ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని తారాభ్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 22 FEB 2024 4:27PM by PIB Hyderabad

జై వాలినాథ్జై-జై వాలినాథ్!

పరంబా హింగ్లాజ్ మాతాజీ కీజైహింగ్లాజ్ మాతాజీ కీ – జై!

భగవాన్ శ్రీ దత్తాత్రేయ కీ – జైభగవాన్ శ్రీ దత్తాత్రేయ కీ – జై!

మీరంతా ఎలా ఉన్నారునేను ఈ గ్రామంలోని పాత సన్యాసులను చూశాను.. నాటి సహచరులను కూడా కలిశానువాలినాథ్ ఒక పండుగ స్ఫూర్తిని అందించారునేను గతంలో చాలాసార్లు వాలినాథ్‌కు వచ్చాను. కానీ నేటి వైభవం ప్రత్యేకంగా ఉందిప్రపంచంలో ఎంత సాదర స్వాగతంగౌరవం లభించినప్పటికీ.. ఇంట్లో ఉన్నప్పుడు కలిగే ఆనందం ప్రత్యేకమైనదిఈ రోజు గ్రామస్తుల్లో నాకు ఏదో ప్రత్యేకత కనిపించిందినేను మా బాబాయి ఇంటికి వచ్చినప్పుడు కలిగిన ఆనందం కూడా ప్రత్యేకమైనదినేను చూసిన వాతావరణం ఆధారంగా భక్తీవిశ్వాసంతో మునిగిపోయిన భక్తులందరినీ నేను స్వాగతిస్తున్నానుఇది ఎంత యాదృచ్చికమో చూడండిఒక నెల కిందట అంటే జనవరి 22 నేను అయోధ్యలో రాముడి పాదాల చెంత ఉన్నానుఅక్కడ నాకు రాముడి చరిత్రాత్మక ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం లభించిందితరువాత అబుదాబిలో ఫిబ్రవరి 14న వసంత పంచమి రోజున గల్ఫ్ దేశాల్లో మొదటి హిందూ దేవాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశమూ నాకు లభించిందిరెండు-మూడు రోజుల క్రిందట ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేసే అవకాశమూ నాకు లభించిందిఈ రోజు తారాభ్‌లోని ఈ అద్భుతమైనదివ్యమైన ఆలయంలో ప్రతిష్ఠానంతర పూజా కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది.

మిత్రులారా,

దేశానికీప్రపంచానికీ వాలినాథ్ శివధామ్ ఒక తీర్థయాత్ర స్థలంకానీ రబారీ సమాజానికి ఇది 'గురుస్థానం'. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న రబారీ సమాజానికి చెందిన భక్తులువివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలూ నాకు కనిపిస్తున్నారుమీ అందరికీ నా అభినందనలు.

మిత్రులారా,

భారత అభివృద్ధి ప్రయాణంలో ఇది ఒక అమృత కాలందైవిక పనులు.. దేశపు పనులు రెండూ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయం ఇదిదేవతల సేవ.. దేశ సేవ రెండూ కొనసాగుతున్నాయిఒక వైపు ఈ పవిత్ర కార్యం సాకారమవుతుండగా.. మరోవైపు 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనప్రారంభోత్సవాలూ జరిగాయిరైల్వేలురహదారులునౌకాశ్రయ రవాణానీరుజాతీయ భద్రతపట్టణాభివృద్ధిపర్యాటకం వంటి అనేక రంగాల్లోని ముఖ్యమైన అభివృద్ధి పనులతో ఈ ప్రాజెక్టులు ముడిపడి ఉన్నాయిఈ ప్రాజెక్టులు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయి.. ఈ ప్రాంత యువతకు ఉపాధిస్వయం ఉపాధి కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తాయి.

నా కుటుంబ సభ్యులారా,

ఈ రోజు ఈ పవిత్ర భూమిపై నాకు ఒక దైవిక శక్తి ఉన్నట్లు అనిపిస్తుందిఈ శక్తి వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్న ఆధ్యాత్మిక చైతన్యంతో మనల్ని కలుపుతుంది. ఈ శక్తి శ్రీకృష్ణుడుశివుడితో సంబంధం కలిగి ఉంటుందిఈ శక్తి మొదటి గధిపతి మహంత్ వీరం-గిరి బాపు జీ ప్రారంభించిన ప్రయాణంతో కూడా మనల్ని కలుపుతుందినేను గధిపతి పూజ్య జయరాం గిరి బాపును కూడా సగౌరవంగా అభినందిస్తున్నానుమీరు గధిపతి మహంత్ బలదేవ్ గిరి బాపు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లి దానిని సాకారం చేశారునాకు బలదేవ్ గిరి బాపుతో దాదాపు 3-4 దశాబ్దాలుగా అనుబంధం ఉందని మీలో చాలా మందికి తెలుసునేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారిని అనేకసార్లు నా నివాసానికి స్వాగతించే అవకాశం నాకు లభించిందిదాదాపు 100 సంవత్సరాలుగా ఆయన మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలిపి.. 2021లో మనల్ని విడిచి వెళ్లిన సమయంలోనూ నేను ఫోన్ ద్వారా నా భావాలను వ్యక్తపరిచానుకానీ ఈ రోజు ఆయన కల నెరవేరడం చూసినప్పుడు నా మనసు ఇలా చెబుతోంది.. ఆయన ఈ రోజు ఎక్కడ ఉన్నా సంతోషంతో ఈ విజయాన్ని చూసి మనల్ని ఆశీర్వదిస్తారువందల సంవత్సరాల ఈ పురాతన ఆలయం ఇప్పుడు 21వ శతాబ్దపు వైభవంపురాతన దైవత్వంతో నిర్మితమైందిసంవత్సరాలుగా వందలాది మంది కళాకారులుకార్మికుల అవిశ్రాంత కృషి ఫలితమే ఈ ఆలయంఈ కృషి కారణంగానే నేడు వాలినాథ్ మహాదేవ్పరంబా శ్రీ హింగ్లాజ్ మాతాజీభగవాన్ దత్తాత్రేయ ఈ అద్భుతమైన ఆలయంలో కొలువై ఉన్నారుఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న నా సహోద్యోగులందరికీ నేను నమస్కరిస్తున్నాను.

సోదరీ సోదరులారా,

మన దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు కాదు.. ఆచారాలకు నిలయాలు మాత్రమే కాదు.. ఇవి వేల సంవత్సరాల నాటి మన ప్రాచీన సంస్కృతీసంప్రదాయాల చిహ్నాలుమన దేశంలోని దేవాలయాలు జ్ఞానంవిజ్ఞానశాస్త్ర కేంద్రాలుగా పనిచేస్తాయి.. దేశాన్నీసమాజాన్నీ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తాయిశివ ధామ్ శ్రీ వాలినాథ్ అఖాడ ఈ పవిత్రమైన విద్యసామాజిక సంస్కరణ సంప్రదాయాన్ని నమ్మకంగా ముందుకు తీసుకెళ్లిందినేను పూజ్య బలదేవ్ గిరి మహారాజ్ జీతో మాట్లాడినప్పుడల్లా.. ఆయన ఆధ్యాత్మికఆలయ విషయాల కంటే సమాజంలోని పిల్లల విద్యపై ఎక్కువ శ్రద్ధ చూపేవారని నాకు బాగా గుర్తుందిపుస్తక ప్రదర్శనల నిర్వహణతో ప్రజల్లో అవగాహన పెరిగిందిపాఠశాలలువసతి గృహాల నిర్మాణం విద్యా స్థాయిని మెరుగుపరిచిందినేడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వందలాది మంది విద్యార్థులకు వసతిలైబ్రరీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయిదైవిక సేవదేశ సేవ కలయికకు ఇంతకంటే మెరుగైన ఉదాహరణ ఇంకేముంటుందిఅటువంటి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు రబారీ సమాజం ప్రశంసలకు అర్హమైనదిదురదృష్టవశాత్తూ రబారీ సమాజానికి చాలా తక్కువ ప్రశంసలు దక్కాయి.

సోదరీ సోదరులారా,

నేడు దేశం 'సబ్ కా సాథ్సబ్ కా వికాస్మంత్రంతో ముందుకు సాగుతోందిఈ మంత్రం స్ఫూర్తి మన దేశంలో ఎలా పాతుకుపోయిందో వాలినాథ్ ధామ్‌లో మనకు స్పష్టంగా కనిపిస్తుందిదేవుడు ఒక రబారీ గొర్రెల కాపరి సోదరుడిని తన అభివ్యక్తికి ఒక సాధనంగా చేసిన ప్రదేశం ఇదిఇక్కడ పూజల బాధ్యత రబారీ సమాజానికి చెందినదే అయినా ఆ బాధ్యత యావత్ సమాజానిదీ అవుతుందిసాధువుల అదే భావనతో మా ప్రభుత్వం సమాజంలోని ప్రతి వర్గంతరగతి వారి జీవితాల్లోని ప్రతి అంశాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉందిసమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పౌరుల జీవితాలను మార్చడమే మోదీ హామీ లక్ష్యంఅందువల్ల దేశంలో దేవాలయాలు నిర్మిస్తున్న సమయంలోనే.. లక్షలాది పక్కా ఇళ్ళు కూడా పేదల కోసం నిర్మిస్తున్నాంకొద్ది రోజుల కిందట గుజరాత్‌లో పేదల కోసం 1.25 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించిపునాది రాయి వేసే అవకాశం నాకు లభించిందిఈ పేద కుటుంబాల ఆశీర్వాదాలను ఊహించుకోండినేడు దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్‌ పొందుతున్నారు.. తద్వారా పేదింటి పొయ్యి కూడా మండుతూనే ఉంటుందిఒక విధంగా ఇది దేవుడిచ్చిన 'ప్రసాదం' (కానుక). నేడు దేశంలో 10 కోట్ల కొత్త కుటుంబాలు తొలిసారిగా కుళాయిల ద్వారా నీటిని పొందుతున్నాయినీటి కోసం చాలా దూరం వెళ్ళాల్సిన పేద కుటుంబాలకు ఇది 'అమృతంకంటే తక్కువ కాదుమన ఉత్తర గుజరాత్ ప్రజలు నీటి కోసం ఎంత ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసువారు రెండు నుంచి మూడు కిలోమీటర్లు తలపై కుండలు మోసుకెళ్లాల్సి వచ్చేదినేను సుజలాం-సుఫలాం పథకాన్ని ప్రారంభించినప్పుడు.. ఉత్తర గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా "సార్మీరు చేసిన పనిని ఎవరూ చేయలేరు. 100 సంవత్సరాలైనా దీనిని ప్రజలు మర్చిపోరుఅని నాతో చెప్పేవారుదానికి సాక్షులు కూడా ఇక్కడ ఉన్నారు.

మిత్రులారా,

గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధితో పాటుగుజరాత్‌లోని వారసత్వ ప్రదేశాల గొప్పతనాన్ని పెంపొందించడానికి కూడా మేం కృషి చేశాందురదృష్టవశాత్తూ స్వతంత్ర భారతంలో అభివృద్ధివారసత్వం మధ్య చాలా కాలం పాటు చీలిక ఏర్పడిందిదీనికి దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీనే కారణంసోమనాథ్ వంటి పవిత్ర స్థలాలనూ వివాదాస్పదం చేసింది వారేపావగఢ్‌లో ఆధ్యాత్మిక పతాకాన్ని ఎగురవేసేందుకూ వారు ఆసక్తి చూపలేదుదశాబ్దాలుగా మోధేరాలోని సూర్య దేవాలయాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నది వారేశ్రీరాముడి ఉనికి గురించి ప్రశ్నలు లేవనెత్తి.. ఆయన ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్నది వారేరాముడి జన్మస్థలంలో అద్భుతమైన ఆలయ నిర్మాణం పూర్తయి యావత్ దేశం ఆనందిస్తున్నప్పుడు కూడా వారు ద్వేష మార్గాన్ని వీడటం లేదు.

సోదరీ సోదరులారా,

ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ దేశపు వారసత్వ పరిరక్షణ చాలా ముఖ్యంగుజరాత్‌లో కూడా భారత ప్రాచీన నాగరికతకు సంబంధించిన అనేక చిహ్నాలు ఉన్నాయిఈ చిహ్నాలు చరిత్రను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలను వారి మూలాలతో అనుసంధానించడానికి ముఖ్యమైనవిఈ చిహ్నాలను సంరక్షించడానికివాటిని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందిఇప్పుడు వడ్నగర్‌లో తవ్వకాల ద్వారా చరిత్రలోని కొత్త అంశాలు ఎలా ఉద్భవిస్తున్నాయో పరిశీలించండి. 2800 సంవత్సరాల క్రితం ప్రజలు నివసించిన  పురాతన స్థావరం జాడలు గత నెలలోనే ఇక్కడ కనుగొన్నారుఅదేవిధంగా ధోలావీరాలోనూ ప్రాచీన భారత దివ్య దృశ్యాలను మనం చూశాంఇది భారత గర్వంమన సుసంపన్న వారసత్వం మనకు గర్వకారణం.

మిత్రులారా,

నేడు నవ భారతంలో జరుగుతున్న ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాలకు ఒక వారసత్వాన్ని సృష్టించే లక్ష్యం గలదికొత్తగా నిర్మితమవుతున్న ఆధునిక రహదారులురైల్వే ట్రాక్‌లు 'వికసిత్ భారత్కోసం సరైన మార్గాలునేడు మెహ్సానా రైల్వే కనెక్టివిటీ బలోపేతమైందిరైల్వే లైన్ల రెట్టింపుతో బనస్కాంతపటాన్‌ల నుంచి కాండ్లాట్యూనాముంద్రా ఓడరేవులకు కనెక్టివిటీ మెరుగైందిఇది కొత్త రైళ్లను నడిపేందుకు వీలు కల్పించింది.. సరుకు రవాణా రైళ్లకు సౌకర్యాలను కూడా అందించిందినేడు దీసా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్‌వే కూడా ప్రారంభమైందిఈ వైమానిక దళ స్టేషన్ రన్‌వేలను కలిగి ఉండటమే కాకుండా భవిష్యత్తులో భారత్ భద్రతకు ముఖ్య కేంద్రంగా కూడా మారుతుందినేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వానికి అనేక లేఖలు రాశాను.. అనేక ప్రయత్నాలూ చేశానుకానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదుఈ ప్రదేశం భారత్ భద్రతకు చాలా ముఖ్యమైనదని వైమానిక దళం అధికారులు చెప్పినా వారు ఏమీ చేయలేదు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నా ఫైళ్లను పక్కన పెట్టేసిందినేను ఈ రన్‌వేకు ఒకటిన్నర సంవత్సరాల క్రితం పునాది రాయి వేశానుమోదీ ఇచ్చిన వాగ్దానాలను కచ్చితంగా నెరవేరుస్తాడు. ఈరోజు దీసాలో రన్‌వే ప్రారంభోత్సవమే దానికి రుజువుమోదీ హామీ ఇలా ఉంటుంది.

మిత్రులారా,

20-25 సంవత్సరాల కిందట ఉత్తర గుజరాత్‌లో అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవిఅప్పట్లో రైతులకు పొలాల్లో నీరు లేదు.. పశువుల పెంపకందారులకూ చాలా సవాళ్లు ఎదురయ్యాయి.. పారిశ్రామికీకరణ పరిధి కూడా చాలా పరిమితంగా ఉండేదినేడు బీజేపీ ప్రభుత్వంలో పరిస్థితి నిరంతరం మారుతోందిఇక్కడి రైతులు సంవత్సరానికి 2-3 పంటలు పండించడం ప్రారంభించారుమొత్తం ప్రాంతంలో భూగర్భజల మట్టం కూడా పెరిగిందినీటి సరఫరానీటి వనరులకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవంశంకుస్థాపనల కార్యక్రమం జరిగిందిఈ ప్రాజెక్టులపై రూ. 1500 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారుఇది ఉత్తర గుజరాత్ నీటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందిఉత్తర గుజరాత్ రైతులు బిందు సేద్యం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించిన విధానం అద్భుతంరసాయనాలు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం చేసే ధోరణి పెరగడమూ నేను ఇక్కడ చూస్తున్నానుమీ ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం పట్ల రైతుల ఉత్సాహాన్ని పెంచుతాయి.

సోదరీ సోదరులారా,

మనమంతా కలిసి మన వారసత్వాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిని కొనసాగిద్దాంఈ దివ్యమైన అనుభవంలో నన్ను భాగస్వామిని చేసినందుకు మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుమీ అందరికీ చాలా ధన్యవాదాలునాతో పాటు మీరూ చెప్పండి --

భారత్ మాతా కీజై!

భారత్ మాతా కీజై!

భారత్ మాతా కీజై!

ధన్యవాదాలు!

గమనికఇది ప్రధానమంత్రి గుజరాతీ ప్రసంగానికి అనువాదం.

 

 

***

 


(Release ID: 2168844) Visitor Counter : 6