ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అత్యంత పవిత్రమైన, అమూల్యమైన శ్రీ గురు గోవింద్ సింగ్, మాతా సాహిబ్ కౌర్‌ల ‘జోరే సాహిబ్’


సంరక్షణ, ప్రదర్శన అంశాలపై సిక్కు ప్రతినిధుల సూచనలు స్వీకరించిన ప్రధాని

Posted On: 19 SEP 2025 4:28PM by PIB Hyderabad

సిక్కు ప్రతినిధుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారుఅత్యంత పవిత్రమైనఅమూల్యమైన శ్రీ గురు గోవింద సింగ్మాతా సాహిబ్ కౌర్‌ల ‘జోరే సాహిబ్’ సంరక్షణప్రదర్శనపై ప్రతినిధులు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ‘జోర్ సాహిబ్’ వంటి పవిత్ర స్మృతి చిహ్నాలు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనవనీవిశేషమైన సిక్కు చరిత్రలో ఒక భాగమనీదేశ సంస్కృతికి మూలాలనీ పేర్కొన్నారు. ‘‘శ్రీ గురు గోవింద్ సింగ్ చూపిన ధైర్యంధర్మంన్యాయంసామాజిక సామరస్య మార్గాన్ని అనుసరించేలా భవిష్యత్ తరాలకు పవిత్రమైన ఈ స్మృతి చిహ్నాలు స్ఫూర్తినిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి పోస్టుకు శ్రీ మోదీ స్పందన:

‘‘శ్రీ గురు గోవింద్ సింగ్మాతా సాహిబ్ కౌర్‌లకు చెందిన అత్యంత పవిత్రమైనఅమూల్యమైన ‘జోరే సాహిబ్’ను సంరక్షించడానికిప్రదర్శించడానికి సిక్కు ప్రతినిధుల బృందం చేసిన విలువైన సూచనలను సంతోషంగా స్వీకరిస్తున్నాను.

సిక్కు చరిత్రలో ‘జోరే సాహిబ్’  పవిత్రమైన స్మృతి చిహ్నాలు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనవిదేశ సాంస్కృతిక మూలాల్లో ఇవి భాగంగా ఉన్నాయి.

శ్రీ గురు గోవింద్ సింగ్ చూపిన ధైర్యంధర్మంన్యాయంసామాజిక సామరస్య మార్గాన్ని అనుసరించేలా భవిష్యత్ తరాలకు ఈ పవిత్ర స్మృతి చిహ్నాలు స్ఫూర్తినిస్తాయి’’


(Release ID: 2168769)