ప్రధాన మంత్రి కార్యాలయం
గౌరవ బ్రిటన్ రాజు చార్లెస్ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను నాటిన ప్రధానమంత్రి
Posted On:
19 SEP 2025 5:24PM by PIB Hyderabad
గౌరవ బ్రిటన్ రాజు చార్లెస్ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో నాటారు. ‘‘పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతపై గౌరవ చార్లెస్ కు ఎంతో నిబద్ధత ఉంది. ఈ అంశం మా చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.’’ అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘‘ఎక్స్’’లో చేసిన పోస్టులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇలా అన్నారు.
‘‘గౌరవ కింగ్ చార్లెస్ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను నేడు ఉదయం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నాటాను. ఆయనకు పర్యావరణం అంటే ఇష్టం. ఈ అంశం మా చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.’’
(Release ID: 2168766)