ప్రధాన మంత్రి కార్యాలయం
పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్
ఉక్రెయిన్‌తో సంక్షోభానికి శాంతియుత పరిష్కారంలో
భారత్ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
ఈ ఏడాది చివర్లో అధ్యక్షుడు పుతిన్‌ను భారత్‌కు
స్వాగతించడానికి ఎదురు చూస్తున్నానన్న ప్రధానమంత్రి
Posted On:
17 SEP 2025 7:20PM by PIB Hyderabad
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.
75వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన శుభాకాంక్షలకీ, శాశ్వత స్నేహానికీ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు ద్వైపాక్షిక ఎజెండాలోని వివిధ అంశాలను ఇరువురు నాయకులు సమీక్షించారు. ఈ ఏడాది చివర్లో అధ్యక్షులు పుతిన్‌ను భారత్‌కు స్వాగతించడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి తెలియజేశారు.
ఉక్రెయిన్‌తో ఘర్షణలకు శాంతియుత పరిష్కారాన్ని సాధించే విషయంలో భారత్ సంపూర్ణ మద్దతును అందిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
సంప్రదింపులను కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు.
***
(Release ID: 2167862)
Visitor Counter : 2