ప్రధాన మంత్రి కార్యాలయం
నార్వే ప్రధాని శ్రీ జోనాస్ గహర్ స్టార్ తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
Posted On:
10 SEP 2025 6:21PM by PIB Hyderabad
నార్వే ప్రధాని పదవికి శ్రీ జోనాస్ గహర్ స్టార్ మళ్లీ ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు. నార్వేతో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్ఠపరుచుకోవాలన్నదే భారత్ నిబద్ధత అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘శ్రీ జోనాస్ గహర్ స్టార్ తిరిగి ఎన్నికైన సందర్భంగా ఆయనకు అభినందనలు. అన్ని రంగాల్లోను భారత్-నార్వే భాగస్వామ్యాన్ని మరింత బలపరచడానికి మీతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను.
@jonasgahrstore”
(Release ID: 2165544)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam