మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక, సంక్షేమ, భద్రతారంగాల్లో చేయాల్సిన సంస్కరణలను గుర్తించేందుకు కార్యశాలను నిర్వహించిన మహిళా, శిశు అభివృద్ధి శాఖ‌

प्रविष्टि तिथि: 10 SEP 2025 12:24PM by PIB Hyderabad

సామాజిక రంగంసంక్షేమ రంగంభద్రత రంగాల్లో ఏయే సంస్కరణలను అమలు చేయవచ్చనే అంశంపై సలహాలను స్వీకరించే ఉద్దేశంతో ఒక కార్యశాలను మహిళాశిశు అభివృద్ధి శాఖ (ఎంఓడబ్ల్యూసీడీనిన్న నిర్వహించింది.

ఈ వర్క్‌షాప్‌నకు ఎంఓడబ్ల్యూసీడీ కార్యదర్శి శ్రీ అనిల్ మలిక్ అధ్యక్షత వహించారురాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధి వర్గాలు పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొన్నాయి.

 

ఈ సమాలోచనలు ‘మిషన్ సక్షమ్ ఆంగన్‌వాడీపోషణ్ 2.0’లో భాగంగా చేపట్టదగ్గ సంస్కరణలపై దృష్టి సారించాయిపోషణఈసీసీఈ సంబంధిత సేవలను మెరుగుపరచడంమహిళల సురక్షభద్రతసాధికారతలను పటిష్ఠపరచడం ముఖ్య ఉద్దేశాలుగా ఉన్న ‘మిషన్ శక్తి’బాలల సమగ్ర ఎదుగుదలకువారి సంరక్షణకు పెద్దపీట వేసే ధ్యేయంతో ‘మిషన్ వాత్సల్య’ను అమలులోకి తీసుకురావాలనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు.

సేవలను చిట్టచివరి అంచె వరకు విస్తరించడంతో పాటు మహిళలుబాలల సంక్షేమమే ప్రధానంగా అభివృద్ధిని సాధించాలనేది పరమావధిగా శాసనవిధానప్రక్రియాపరమైన సంస్కరణలతో పాటు సంస్థాగత సంస్కరణలపైన కూడా చాలా విలువైన సూచనలనుసలహాలను అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు ఈ సందర్భంగా పంచుకున్నారు.

 

మహిళలకుబాలలకే ప్రాధాన్యం’ అన్న దృష్టి కోణం విషయంలో మహిళలుబాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చాటుకొంటున్న నిబద్ధతను.. ఈ వర్క్‌షాపును నిర్వహించి సహకారాత్మక సంస్కరణ ప్రధాన ఆలోచనలుఉమ్మడి భాగస్వామ్యం అనే రూపాలలో.. పునరుద్ఘాటించారు.

 

**‌*


(रिलीज़ आईडी: 2165321) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Odia , Tamil , Malayalam