ప్రధాన మంత్రి కార్యాలయం
పౌరులందరికీ సరసమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
04 SEP 2025 8:27PM by PIB Hyderabad
ప్రతి పౌరుడికి సరసమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించడం పట్ల ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు. జన్ ఔషధి కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్ వంటి పరివర్తనాత్మక కార్యక్రమాలు ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు #NextGenGST సంస్కరణల కింద ఒక కీలక ముందడుగు వేసింది.
‘ఎక్స్’ వేదికగా డాక్టర్ సుమీత్ షా చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
“ప్రతి భారతీయుడికి సరసమైన ఆరోగ్య సంరక్షణ అందించడం ఎల్లప్పుడూ మా లక్ష్యం.
జన్ ఔషధి కేంద్రాల నుంచి ఆయుష్మాన్ భారత్ దాకా.. ఇప్పుడు 33 ప్రాణాధార ఔషధాలపై పన్ను పూర్తిగా మినహాయించడం సహా ముఖ్యమైన ఆరోగ్య ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపుతో అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులో ఉంచుతూ.. సరసమైన ధరకు అందించే దిశగా మేం మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం.
#NextGenGST”
(रिलीज़ आईडी: 2163961)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam