రాష్ట్రపతి సచివాలయం
మిలాద్-ఉన్-నబి సందర్భంగా భారత రాష్ట్రపతి శుభాకాంక్షలు
Posted On:
04 SEP 2025 6:06PM by PIB Hyderabad
రేపు మిలాద్-ఉన్-నబి సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తన సందేశంలో ఇలా పేర్కొన్నారు:-
“మిలాద్-ఉన్-నబిగా జరుపుకొనే ప్రవక్త ముహమ్మద్ జన్మదిన సందర్భంగా.. తోటి పౌరులందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఐక్యత, మానవ సేవా సందేశాన్ని ప్రవక్త మహమ్మద్ అందించారు. ఆయన బోధనలను మననం చేసుకోవడానికి, సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ పండుగ మనకు స్ఫూర్తినిస్తుంది.
ఈ శుభ సందర్భంగా, ప్రవక్త మహమ్మద్ బోధనల నుంచి స్ఫూర్తిని పొంది ప్రేమ, సోదరభావంతో ముందుకు సాగుదాం.”.
రాష్ట్రపతి సందేశాన్ని వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
(Release ID: 2163933)
Visitor Counter : 2