ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జర్మనీ విదేశాంగ మంత్రితో భారత ప్రధాని భేటీ

Posted On: 03 SEP 2025 8:40PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్‌తో భేటీ అయ్యారు. ‘‘భారత్జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయ్యాయిశక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా, చైతన్యవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా.. వాణిజ్యంసాంకేతికతఆవిష్కరణసుస్థిరతతయారీరవాణా సహా ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు విస్తృత అవకాశాలు స్పష్టంగా మన కళ్లముందున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్‌ను కలవడం ఆనందంగా ఉందిభారత్జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయ్యాయిశక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగాచైతన్యవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా.. వాణిజ్యంసాంకేతికతఆవిష్కరణసుస్థిరతతయారీరవాణా సహా ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు విస్తృత అవకాశాలు స్పష్టంగా మన కళ్లముందున్నాయిబహు ధ్రువ ప్రపంచంశాంతిఐక్యరాజ్యసమితి సంస్కరణల దిశగా మనకు ఉమ్మడి లక్ష్యాలున్నాయిత్వరగా భారత్ ను సందర్శించాల్సిందిగా జర్మనీ ఛాన్సలర్‌ను మరోసారి ఆహ్వానిస్తున్నాను.@_FriedrichMerz ’’ 


(Release ID: 2163530) Visitor Counter : 2