హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జమ్మూలో జరిగిన సమావేశంలో జమ్మూకాశ్మీర్ భద్రతా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్ర శాంతియుతంగా నిర్వహించిన

కేంద్ర పాలనా యంత్రాంగాన్నీ, భద్రతా సంస్థలనీ ప్రశంసించిన హోంమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో

ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన కోసం అన్ని భద్రతా సంస్థలు

అప్రమత్తంగా ఉంటూ.. సమన్వయంతో పనిచేయాలని ఆదేశం

జమ్మూకాశ్మీర్‌ ఆకస్మిక వరద సహాయ, రక్షణ చర్యల్లో అనేకమంది

ప్రాణాలు కాపాడిన భద్రతా దళాలను ప్రశంసించిన హోంమంత్రి

జమ్మూకాశ్మీర్‌ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో

సీఏపీఎఫ్‌లకు సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ

Posted On: 01 SEP 2025 7:24PM by PIB Hyderabad

జమ్మూలో ఈ రోజు జరిగిన సమావేశంలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా జమ్మూకాశ్మీర్ భద్రతా పరిస్థితిని సమీక్షించారుఈ సమావేశంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాకేంద్ర హోం శాఖ కార్యదర్శిడైరెక్టర్ (ఐబీ), జమ్మూకాశ్మీర్ ప్రధాన కార్యదర్శిడీజీపీసీఏపీఎఫ్ విభాగాల అధిపతులుఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

జమ్మూకాశ్మీర్ భద్రతా పరిస్థితిని సమీక్షిస్తూ.. ఈ సంవత్సరం శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్రను శాంతియుతంగా నిర్వహించడంలో కేంద్రపాలిత ప్రాంత పరిపాలన యంత్రాగంభద్రతా సంస్థల కృషిని కేంద్ర హోంమంత్రి ప్రశంసించారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని విధానంతో ముందుకుసాగుతున్నామని ఆయన స్పష్టం చేశారుజమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన కోసం అన్ని భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉంటూ.. సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆదేశించారు.

 

జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల సమయంలో చేపట్టిన సహాయ, రక్షణ చర్యల్లో అనేక మంది ప్రాణాలను కాపాడడంలో భద్రతా దళాల పాత్రను శ్రీ అమిత్ షా ప్రశంసించారుజమ్మూకాశ్మీర్‌లో ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో సీఏపీఎఫ్‌లకు పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

 

***


(Release ID: 2162934) Visitor Counter : 2