కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీఎస్ఎన్ఎల్ ‘ఫ్రీడమ్ ప్లాన్’ మరో 15 రోజులు పొడిగింపు

Posted On: 01 SEP 2025 1:42PM by PIB Hyderabad

వినియోగదారుల నుంచి లభిస్తున్న విశేష స్పందన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ’తమ ఫ్రీడమ్ ప్లాన్‘ను మరో 15 రోజులపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీడ్రమ్ ప్లాన్ ను ఆగస్టు 1న కేవలం రూ. 1తో ప్రారంభించింది. ఇందులో భాగంగా  కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకునే వినియోగదారులకు కేవలం రూ.1కే  30 రోజులపాటు అపరిమిత 4జీ  సేవలను అందిస్తుంది. మొదట ఈ అవకాశం ఆగస్టు 1 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం దీనిని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. 

ఫ్రీడమ్ ప్లాన్ ప్రయోజనాలు:

1. అపరిమిత వాయిస్ కాల్స్(ప్లాన్ నిబంధనల ప్రకారం)

2.రోజుకు 2 జీబీ హై స్పీడ్  డేటా

3. రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు

4.ఉచిత సిమ్ ( డీఓటీ మార్గదర్శకాల ప్రకారం కేవైసీ తప్పనిసరి)

  ఫ్రీడమ్ ప్లాన్ పొడిగింపు సందర్భంగా బీఎస్ఎన్ఎల్ సీఎండీ శ్రీ ఏ రాబర్ట్ జే రవి మాట్లాడుతూ..

 "బీఎస్ఎన్ఎల్ ఇటీవల మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునిక 4G మొబైల్ సేవలను ప్రారంభించింది. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇదొక గొప్ప ప్రయత్నం. ఫ్రీడమ్ ప్లాన్ ప్రకారం మొదటి 30 రోజులు పూర్తిగా ఉచిత సేవలు అందిస్తున్నాం. ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ సేవలను ఉపయోగించుకునే గొప్ప అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తుంది. మా సేవల నాణ్యతపరిధిబీఎస్ఎన్ఎల్ సంస్థ‌పై ఉన్న నమ్మకం వల్ల ఈ ప్లాన్ ముగిసిన తర్వాత కూడా వినియోగదారులు మా సేవలను కొనసాగిస్తారని మేం నమ్ముతున్నాం."

 

 

ఫ్రీడమ్ ప్లాన్ పొందే విధానం


1. సమీపంలోని బీఎస్ఎన్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రం(సీఎస్సీ) వద్దకు వెళ్లాలి.(సరైన కేవైసీ పత్రాలు తీసుకెళ్లాలి)

2. ఫ్రీడమ్ ప్లాన్ రూ.యాక్టివేషన్ గురించి అడగండి.  కేవైసీ పూర్తి చేసి ఉచిత సిమ్ పొందాలి.

3. సిమ్‌ను ఫోన్‌లో పెట్టి యాక్టివేషన్ ప్రక్రియ పూర్తిచేయాలి. యాక్టివేషన్ అయిన రోజు నుంచి 30 రోజుల వరకు ఈ ప్లాన్ కు సంబంధించిన ఉచిత ప్రయోజనాలు ప్రారంభమవుతాయి.

4. సహాయం కోసం:  1800-180-1503 లేదా bsnl.co.in సందర్శించండి.

 

***


(Release ID: 2162767) Visitor Counter : 2