ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా కన్నుమూత... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
24 AUG 2025 7:48PM by PIB Hyderabad
శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యుడు, రాజ్‌సదన్ అయోధ్య ముఖ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా తన జీవనాన్ని ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు అంకితం చేశారని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యుడు, రాజ్‌సదన్ అయోధ్య ముఖ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం ఎంతో బాధ కలిగించింది. ఆయన తన జీవితాన్ని ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు అంకితం చేశారు. శ్రీ రామ ప్రభువు తన శ్రీచరణాలలో ఆయనకు స్థానాన్ని ఇవ్వాలని, శోకసంద్రంలో మునిగిన ఆయన ఆత్మీయులకు, అభిమానులకు ఈ కష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’’.
****
(Release ID: 2160472)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam