ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
కోటా - బుండి (రాజస్థాన్)లో రూ.1,507 కోట్లతో నూతన విమానాశ్రయ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
Posted On:
19 AUG 2025 3:13PM by PIB Hyderabad
రాజస్థాన్ లోని కోటా - బుండి వద్ద రూ.1507.00 కోట్ల అంచనా వ్యయంతో కొత్త విమానాశ్రయ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం నేడు ఆమోదం తెలిపింది.
చంబల్ నదీ తీరంలో ఉన్న కోటా, రాజస్థాన్ పారిశ్రామిక రాజధానిగా గుర్తింపు పొందింది. అంతేగాక దేశంలో పోటీ పరీక్షలకు ప్రముఖ కోచింగ్ హబ్‌గానూ ప్రసిద్ధి చెందింది.
A-321 రకం విమానాల నిర్వహణకు అనువైన నూతన విమానాశ్రయ అభివృద్ధికి రాజస్థాన్ ప్రభుత్వం 440.06 హెక్టార్ల భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సమకూర్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తారు. అత్యంత రద్దీ సమయాల్లో వెయ్యి మంది, వార్షికంగా 2 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యం ఈ భవనానికి ఉంటుంది. వీటికి తోడు 3200 మీటర్లు x 45 మీటర్ల పరిమాణంలో 11/29 రన్‌వే , A-321 రకానికి చెందిన విమానాల కోసం 07 పార్కింగ్ బేలతో కూడిన ఏప్రాన్, రెండు లింక్ టాక్సీవేలు, ఏటీసీ-టెక్నికల్ బ్లాక్, అగ్ని మాపక కేంద్రం, కారు పార్కింగ్, ఇతర అనుబంధ సౌకర్యాలు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంటాయి.
విద్య, పారిశ్రామిక రంగాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటా ప్రాంతంలో నిర్మించబోయే నూతన విమానాశ్రయం భవిష్యత్ రవాణా అవసరాలను తీర్చే కీలక మౌలిక వసతుల ప్రాజెక్ట్ కానుంది.
ప్రస్తుత కోటా విమానాశ్రయం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉంది. ఇది కోడ్ 'బీ' విమానాలకు (DO-228 వంటివి) అనువైన 1220 మీ x 38 మీ పరిమాణంలో రన్‌వే (08/26) కలిగి ఉంది. అలాగే, ఈ తరహా విమానాలు రెండిటిని నిలపగల సామర్థ్యం గల ఏప్రాన్ కూడా ఉంది.ఇది రెండు విమానాలను నిలిపి ఉంచగల సామర్థ్యం కలిగిన ఆప్రాన్‌ను కలిగి ఉంటుంది. ఈ టెర్మినల్ భవనం 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. రద్దీ సమయాల్లో 50 మంది ప్రయాణీకులను నిర్వహించగలదు. ఈ విమానాశ్రయం చుట్టూ తగినంత భూలభ్యత లేకపోవడం, పట్టణీకరణ పెరగడం వల్ల దీన్నివాణిజ్య కార్యకలాపాల కోసం అభివృద్ధి చేయడానికి వీలు పడదు.
***
(Release ID: 2158032)
Visitor Counter : 7
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada