రాష్ట్రపతి సచివాలయం
15వ తేదీ పార్శీల నూతన సంవత్సరాది: శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
Posted On:
14 AUG 2025 5:08PM by PIB Hyderabad
పార్శీ నూతన సంవత్సరాది పర్వదిన సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘పారసీ నూతన సంవత్సరం నవ్‌రోజ్ శుభ సందర్భంగా, నేను నా దేశ ప్రజానీకానికి, ప్రత్యేకించి పార్శీ సోదరీ సోదరులకు స్నేహపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
నవ్‌రోజ్ అంటేనే సరికొత్తదనం, ఆశలతో పాటు సమృద్ధికి మారుపేరు. ఇది పార్శీలకు ముఖ్యమైన పండుగే కాక, మన సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్సవంగా నిర్వహించుకొనే సందర్భం కూడా. పార్శీల్లో ఉట్టిపడే వాణిజ్య సంబంధ ఉత్సాహం, ప్రజా సంక్షేమానికి అంకితమవ్వాలన్న భావన.. ఇవి మన దేశ ప్రగతికి అమూల్యమైన సేవలను అందించాయి.
ఈ విశిష్ట ఉత్సవం అందరికీ శాంతినీ, సమృద్ధినీ ప్రసాదించాలనీ, సమ్మిళిత దేశ నిర్మాణానికి పౌరులందరూ తలో చేయి వేసేటట్లు ప్రేరణను ఇవ్వాలనీ నేను కోరుకుంటున్నాను.’’
రాష్ట్రపతి సందేశాన్ని ఇక్కడ చూడవచ్చును..
Please click here to see the President's message-
***
(Release ID: 2156474)