సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
స్వాతంత్ర్య దినోత్సవాలకు ‘విశిష్ట అతిథులు’గా 100 మంది ఎస్సీ-ఎస్టీ హబ్ పథకం లబ్ధిదారులకు ఆహ్వానం
ఢిల్లీలో జరిగే ఉత్సవాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు హాజరుకానున్న విశిష్ట అతిథులు
Posted On:
14 AUG 2025 1:32PM by PIB Hyderabad
జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ (ఎన్ఎస్ఎస్‌హెచ్) పథకం ద్వారా లబ్ధి పొందిన వంద మంది లబ్ధిదారులను జీవిత భాగస్వాములతో సహా న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర్య వేడుకలను వీక్షించడానికి ‘‘విశిష్ట అతిథులు’’గా భారత ప్రభుత్వం ఆహ్వానించింది.
ఎస్సీ/ఎస్టీల్లో ఔత్సాహిక పారిశ్రామికతను ప్రోత్సహించడం, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రజా సేకరణ విధానం ప్రకారం ఎస్సీ/ఎస్టీ ఎంఎస్ఈల నుంచి 4 శాతం సేకరించాలనే నిబంధనను నెరవేర్చే లక్ష్యంతో 2016, అక్టోబర్లో ప్రధానమంత్రి ఈ ఎన్ఎస్ఎస్‌హెచ్ పథకాన్ని ప్రారంభించారు. ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అవసరమైన పూర్తి సహాకారాన్ని ఈ పథకం అందిస్తుంది. ప్రస్తుతం, ఎన్ఎస్ఎస్‌హెచ్ పథకం ద్వారా 1.48 లక్షల మంది ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందుతున్నారు.
ఆరు ఈశాన్య రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఈ లబ్ధిదారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి, సహాయ మంత్రి ఈ ప్రత్యేక అతిథుల గౌరవార్థం 2025, ఆగస్టు 15 మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలోని చారిత్రక ప్రదేశాలను కూడా వారు సందర్శిస్తారు.
****
(Release ID: 2156354)