భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

కొనసాగుతున్న ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన

నమోదై గుర్తింపు పొందని 476 రాజకీయ పార్టీల (ఆర్‌యూపీపీ)ను జాబితా నుంచి తొలగించేందుకు ఈసీఐ కసరత్తు

· ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 9

Posted On: 11 AUG 2025 5:17PM by PIB Hyderabad
1. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ నిబంధనల ప్రకారం దేశంలోని రాజకీయ పార్టీలు (జాతీయ/రాష్ట్ర/నమోదయ్యి గుర్తింపు పొందని పార్టీలు) భారత ఎన్నికల సంఘం వద్ద నమోదయ్యాయి.

2. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఒకసారి రాజకీయ పార్టీగా నమోదైన ఏ అసోసియేషన్ కైనా చిహ్నం, పన్ను మినహాయింపుల వంటి కొన్ని ప్రత్యేక హక్కులు, ప్రయోజనాలు  లభిస్తాయి.

3. ఏదయినా పార్టీ వరుసగా ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకపోతే, దానిని నమోదైన పార్టీల జాబితా నుంచి తొలగించాలని రాజకీయ పార్టీల నమోదు మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.

4. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర, నిరంతర వ్యూహంలో భాగంగా.. 2019 నుంచి వరుసగా ఆరేళ్ల పాటు ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయకుండా, ఆ నిబంధనను నెరవేర్చడంలో విఫలమైన నమోదయ్యి గుర్తింపు పొందని రాజకీయ పార్టీల (ఆర్‌యూపీపీ)ను గుర్తించి జాబితా నుంచి తొలగించడం కోసం భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా కసరత్తు చేస్తోంది.

5. ఈ ప్రక్రియ మొదటి విడతలో భారత ఎన్నికల సంఘం ఇప్పటికే 334 ఆర్‌యూపీపీలను 2025 ఆగస్టు 9న ఆ జాబితా నుంచి తొలగించింది. దాంతో ఆ జాబితాలోని పార్టీల సంఖ్య 2,854 నుంచి 2,520కి తగ్గింది.

7. రెండో విడత కసరత్తులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మరో 476 ఆర్‌యూపీపీలను గుర్తించారు. (అనుబంధంలో పేర్కొన్నవి)

ఏ పార్టీనీ అనుచితంగా జాబితా నుంచి తొలగించకుండా చూసేందుకు.. ఈ ఆర్‌యూపీపీలకు షోకాజ్ నోటీసులివ్వాలని ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సీఈవోలకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం, సంబంధిత సీఈవోలకు పార్టీలు తమ వాదన వినిపించుకునే అవకాశం లభిస్తుంది.

8. సీఈవోల నివేదికల ఆధారంగా ఏదైనా ఆర్‌యూపీపీని జాబితా నుంచి తొలగించడానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుంది.
 
 

అనుబంధం

రాష్ట్రాల వారీగా ఆర్‌యూపీపీల సంఖ్య

 

 
 

SI No.

State/UT

No. of RUPPs

1

Andaman & Nicobar Island

1

2

Andhra Pradesh

17

3

Assam

3

4

Bihar

15

5

Chandigarh

1

6

Chhattisgarh

7

7

Delhi

41

8

Goa

5

9

Gujarat

10

10

Haryana

17

11

Himachal Pradesh

2

12

Jammu & Kashmir

12

13

Jharkhand

5

14

Karnataka

10

15

Kerala

11

16

Madhya Pradesh

23

17

Maharashtra

44

18

Manipur

2

19

Meghalaya

4

20

Mizoram

2

21

Nagaland

2

22

Odisha

7

23

Punjab

21

24

Rajasthan

18

25

Tamil Nadu

42

26

Telangana

9

27

Tripura

1

28

Uttar Pradesh

121

29

Uttarakhand

11

30

West Bengal

12

 

Total

476

 

***


(Release ID: 2155244)