ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఉక్రెయిన్ కు సంబంధించిన తాజా పరిణామాలను ప్రధానికి వివరించిన అధ్యక్షుడు పుతిన్

ఘర్షణను శాంతియుతంగా పరిష్కరించుకోవాలంటూ భారత్ స్థిరమైన వైఖరిని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి

ప్రత్యేకమైన, ప్రాధాన్యత కలిగిన భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఇద్దరు నేతల పునరుద్ఘాటన

ఈ ఏడాది చివర్లో జరిగే వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ కు రావాలని అధ్యక్షుడు పుతిన్ ను ఆహ్వానించిన ప్రధాని

Posted On: 08 AUG 2025 6:31PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.

ఉక్రెయిన్ కు సంబంధించిన తాజా పరిణామాలను అధ్యక్షుడు పుతిన్ ప్రధానికి వివరించారు.

తాజా పరిస్థితులు గురించి వివరంగా సమాచారం అందించినందుకు అధ్యక్షుడు పుతిన్ కు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలుపుతూఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కావాలనే భారత్‌ స్థిరమైన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.

ద్వైపాక్షిక అంశాల అమలులో పురోగతిని కూడా ఇరువురు నేతలు సమీక్షించారు.  రెండు దేశాల మధ్య ప్రత్యేకమైనప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఈ ఏడాది చివర్లో జరిగే 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ కు రావాలని పుతిన్ ను ప్రధాని ఆహ్వానించారు.

 

***


(Release ID: 2154505)