రక్షణ మంత్రిత్వ శాఖ
పహల్గామ్ దాడి ఉగ్రవాదుల గుర్తింపు నివేదిక గురించి వివరణ
Posted On:
04 AUG 2025 8:44PM by PIB Hyderabad
పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల గుర్తింపు, వారి నేపథ్యంపై మీడియా, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారంలో ఉన్న కథనాన్ని భారత రక్షణ దళాలకు ఆపాదిస్తున్నారు. అయితే, సాయుధ దళాలకు చెందిన ఏ సామాజిక మాధ్యమాల అధికారిక మీడియా హ్యాండిల్ దీనిపై అధికారికంగా ఎలాంటి నివేదికనూ విడుదల చేయలేదు. ఈ తరహా నివేదికేదీ తయారు కాలేదు. సాయుధ దళాలకు చెందిన ప్రజా సంబంధాల కార్యాలయాలు, అధికారిక ప్రతినిధులు కూడా ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
ఎన్‌కౌంటర్ తర్వాత బయటకొచ్చిన సమాచారాన్ని అందరికి అందుబాటులో ఉన్న వేదికల (ఓపెన్ సోర్స్) నుంచి తీసుకొని ఈ నివేదికని తయారు చేసి ఉండొచ్చని తెలుస్తోంది.
***
(Release ID: 2152399)