ప్రధాన మంత్రి కార్యాలయం
మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన ప్రధానమంత్రి
Posted On:
26 JUL 2025 6:47PM by PIB Hyderabad
మాల్దీవుల దేశంలో అధికారిక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు ముయిజు ఆతిథ్యం ఇచ్చిన ప్రభుత్వాధినేత లేదా దేశ నాయకుడు కూడా ప్రధాని మోదీనే కావటం విశేషం.
రిపబ్లిక్ స్క్వేర్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కవాతును మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీక్షించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మాల్దీవుల జాతీయ రక్షణ దళాలు, ఇతర స్థానిక సాయుధ దళాలు నిర్వహించిన ఉత్సాహభరితమైన కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆధునిక దేశంగా మాల్దీవులు సాధించిన విజయాలను ఇవి తెలియజేశాయి.
తనకు లభించిన సాదర ఆహ్వానానికి అధ్యక్షుడితో పాటు ఆ దేశ ప్రజలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా మోదీ పాల్గొనడం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుంది. భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు 2025తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి.
(Release ID: 2149035)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam