హోం మంత్రిత్వ శాఖ
జనాభా లెక్కలు- 2027
Posted On:
22 JUL 2025 3:47PM by PIB Hyderabad
జన గణనను చేపట్టాలన్న అభిమతాన్ని ప్రభుత్వం గత నెల 16న గెజిట్ నోటిఫికేషన్‌లో తెలియజేయడంతో జనాభా లెక్కలు-2027ను (‘సెన్సస్ 2027’) సిద్ధం చేసే ప్రక్రియ మొదలైంది. ఈ విషయంలో, ఒక సమావేశాన్ని ఈ నెల 3, 4 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో సెన్సస్ కార్యకలాపాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో పాటు భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
జనాభా లెక్కల సేకరణకు అనురించాల్సిన మార్గసూచీ, సంబంధిత కార్యకలాపాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. చర్చించిన ఇతర అంశాల్లో.. పాలన విభాగాల రూపురేఖలపై తుది నిర్ణయం, మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి సమాచారాన్ని సేకరించడం, సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎంఎస్) పోర్టల్ ద్వారా జనగణన సంబంధిత కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణ, జనాభా లెక్కల సేకరణ కార్యక్రమంలో పాల్గొనే అధికారులకు శిక్షణనివ్వడం,సెల్ఫ్-ఎన్యూమరేషన్, తదితరాలు ఉన్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ లోక్ సభ లో ఒక ప్రశ్నకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2146888)