ప్రధాన మంత్రి కార్యాలయం
ఢాకా విమాన ప్రమాద విషాదంలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం
Posted On:
21 JUL 2025 7:07PM by PIB Hyderabad
ఢాకా విమాన ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ విషాదంలో మృత్యువాత పడిన వారిలో యువ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశ్‌కు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని, సాధ్యమైన మేరకు అన్ని విధాలుగా సహాయ సహహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం దిగ్ర్భాంతిని కలిగించింది. మనసును కలచివేసిన దుర్ఘటన. చనిపోయిన వారిలో యువ విద్యార్థులే ఎక్కువగా ఉండడం విషాదకరం. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. బంగ్లాదేశ్‌కు భారత్... సంఘీభావం ప్రకటిస్తోంది. అన్నివిధాలుగా సహాయ సహకారాలను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.”
***
(Release ID: 2146637)