ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వన మహోత్సవ వేడుకల్లో గౌరవ న్యాయమూర్తులు ఉత్సాహంగా పాల్గొనడం ప్రశంసనీయం: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 JUL 2025 7:02PM by PIB Hyderabad

వన మహోత్సవ వేడుకల్లో గౌరవ న్యాయమూర్తులు ఉత్సాహంగా పాల్గొనడం ప్రశంసనీయమని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పర్యావరణ బాధ్యత పట్ల పౌరులను ప్రేరేపించడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు.

తమ మాతృమూర్తికి నివాళిగా మొక్కలు నాటేలా పౌరులను ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా చేపట్టిన "ఏక్ పేడ్ మా కే నామ్" కార్యక్రమానికి వారి భాగస్వామ్యం కొత్త ఊపునిస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఢిల్లీ-ఎన్‌సీటీ మంత్రి శ్రీ మంజిందర్ సింగ్ సిర్సా ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్టుకు ప్రతిస్పందిస్తూ, ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"వన మహోత్సవంలో గౌరవ న్యాయమూర్తులు పాల్గొనడం అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఇది 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారానికి కచ్చితంగా కొత్త ఊపునిస్తుందని నేను భావిస్తున్నాను."

#EkPedMaaKeNaam”

*****

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2146205) సందర్శకుల సూచీ సంఖ్య : : 18