ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ కోట శ్రీనివాస రావు మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
13 JUL 2025 3:55PM by PIB Hyderabad
శ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీ కోట శ్రీనివాసరావు తన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో సదా గుర్తుండిపోతారని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆయన అన్ని తరాల ప్రేక్షకులను తన అద్భుత నటనా కౌశలంతో అలరించారన్నారు. సామాజిక సేవలోనూ ఆయన ముందంజలో ఉన్నారనీ, పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసం శ్రీ కోట శ్రీనివాస రావు కృషి చేశారని ప్రధానమంత్రి కొనియాడారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన తన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. అన్ని తరాల ప్రేక్షకులను తన అద్భుత నటనా కౌశలంతో అలరించారు. సామాజిక సేవలోనూ ఆయన ముందంజలో ఉన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసం కృషి చేశారు. ఆయన కుటుంబానికీ, అశేష అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి."
(रिलीज़ आईडी: 2144408)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam