ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రెజిల్‌లో ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి
Posted On:
06 JUL 2025 8:28AM by PIB Hyderabad
బ్రెజిల్‌లోని ప్రవాస భారతీయులు రియో డి జనీరోలో తనకు ఆత్మీయంగా స్వాగతం పలకడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. వారు భారతీయ సంస్కృతితో ముడిపడి ఉండడం.. భారత అభివృద్ధి పట్ల అత్యంత మక్కువ చూపడం ఆనందంగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వాగతానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను కూడా శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు..
"బ్రెజిల్‌లోని ప్రవాస భారతీయులు రియో డి జనీరోలో చాలా ఉత్సాహంగా స్వాగతం పలికారు. వారు భారతీయ సంస్కృతితో ముడిపడి ఉండడం.. భారత అభివృద్ధి పట్ల అత్యంత మక్కువ చూపడం ఆనందం కలిగించింది! ఈ అపూర్వ స్వాగతానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి..."
***
MJPS/ST
(Release ID: 2142608)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam