ప్రధాన మంత్రి కార్యాలయం
ఆక్రాలోని ఎన్క్రుమా సంస్మరణ వాటికలో నివాళులర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
03 JUL 2025 3:50PM by PIB Hyderabad
ఘనా దేశం ఆక్రా నగరంలోని ఎన్క్రుమా సంస్కరణ వాటికను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... దివంగత నేత, ఆఫ్రికా స్వాతంత్ర్య వీరుడు, దేశాన్ని ఉనికిలోకి తెచ్చిన తొలి దేశాధ్యక్షుడు డాక్టర్ క్వామే ఎన్క్రుమాకు ఘన నివాళులు అర్పించారు. ఘనా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ నానా జేన్ ఓపుకు-ఆగ్యేమాంగ్ ప్రధాని వెంట ఉన్నారు. స్వాతంత్ర్యం, ఐక్యత, సామాజిక న్యాయం వంటి ఆశయాల సాధనకు డాక్టర్ ఎన్క్రుమా చేసిన కృషిని, ఆయా రంగాలపై చెక్కుచెదరని ఆయన ప్రభావానికి గౌరవ సూచకంగా శ్రీ మోదీ పుష్ప గుచ్ఛాన్ని ఉంచి మౌనం పాటించారు.
ఘనా దేశ ఘన చారిత్రిక వారసత్వం పట్ల భారత్ కు గల గౌరవాన్ని ప్రధాని నివాళి ప్రతిబింబించింది. ఇరు దేశాల మధ్య గల దృఢమైన స్నేహ బంధాలు, సహకార స్ఫూర్తిని పునరుద్ఘాటించింది.
***
(रिलीज़ आईडी: 2141850)
आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam