ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

48వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి

గనులు, రైల్వేలు, జల వనరుల శాఖల కీలక ప్రాజెక్టులను సమీక్షించి, గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించిన ప్రధానమంత్రి

అందరికీ సమానంగా ఆరోగ్య సదుపాయాలను అందుబాటులో ఉంచేందుకు.. మారుమూల, ఆకాంక్షాత్మక జిల్లాల్లో

ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరిన ప్రధానమంత్రి

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి వ్యూహాత్మక పాత్రను ప్రస్తావించిన ప్రధానమంత్రి

దేశవ్యాప్తంగా అత్యుత్తమ పద్ధతులను అనుసరించాలని పిలుపు

Posted On: 25 JUN 2025 9:11PM by PIB Hyderabad

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను సజావుగా సమన్వయం చేయడం ద్వారా ముందుచూపుతో కూడిన పాలన అందించడం – సకాలంలో పనులను పూర్తి చేయడం లక్ష్యంగా ఏర్పాటైన ఐసీటీ ఆధారితమల్టీ-మోడల్ వేదిక ప్రగతి 48వ సమావేశం ఈరోజు ఉదయం సౌత్ బ్లాకులో నిర్వహించారుఈ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

గనులురైల్వేలుజలవనరుల శాఖలకు సంబంధించిన పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈ సమావేశంలో సమీక్షించారుకాలపరిమితులుసంస్థల మధ్య సమన్వయంసమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ.. ఆర్థికవృద్ధికీప్రజా సంక్షేమానికీ కీలకమైన ఈ ప్రాజెక్టుల పురోగతిని ప్రధానమంత్రి సమీక్షించారు.

ప్రాజెక్టుల అమలులో జాప్యం వల్ల ఆర్థిక వ్యయం పెరగడంపౌరులకు అవసరమైన సేవలుమౌలిక సదుపాయాలు సకాలంలో లభించకపోవడం వంటి రెండు నష్టాలు ఉంటాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఅవకాశాలను జీవితాలను మెరుగుపరిచేవిగా మార్చుకునేందుకు ఫలితాల ఆధారిత విధానాన్ని అవలంబించాలని కేంద్రరాష్ట్ర స్థాయి అధికారులను ఆయన కోరారు.

ప్రధానమంత్రి-ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ (పీఎమ్-ఏబీహెచ్ఐఎమ్గురించిన సమీక్ష సందర్భంగా..అన్ని రాష్ట్రాలు ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలనీఆకాంక్షాత్మక జిల్లాలుమారుమూలగిరిజనసరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రధానమంత్రి కోరారుపేదలుఅణగారినవెనుకబడిన జనాభా కోసం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందరితో సమానంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారుఈ ప్రాంతాల్లో కీలకమైన ఆరోగ్య సేవల్లో ఉన్న అంతరాలను తగ్గించడం కోసం అవసరమైన తక్షణనిరంతర ప్రయత్నాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాలు తమ ప్రాథమికతృతీయప్రత్యేక ఆరోగ్య మౌలిక సదుపాయాలను మండలజిల్లారాష్ట్ర స్థాయుల్లో బలోపేతం చేసుకోవడానికి.. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణనుసేవలను అందించడానికి పీఎమ్-ఏబీహెచ్ఐఎమ్ ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

రక్షణ రంగంలో స్వయంసమృద్ధిని పెంపొందించడంలో వివిధ మంత్రిత్వ శాఖలువిభాగాలురాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన ఆదర్శప్రాయమైన పద్ధతులను ప్రధానమంత్రి సమీక్షించారురక్షణ రంగంలో వ్యూహాత్మక ప్రాముఖ్యతఆవిష్కరణలను ప్రోత్సహించే సామర్థ్యం గలవిగా ఈ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారువాటి విస్తృత ఔచిత్యాన్ని వివరిస్తూ..పూర్తి స్వదేశీ సామర్థ్యాలతో అమలు చేసిన ఆపరేషన్ సిందూర్ విజయం రక్షణ రంగంలో భారత్ స్వయంసమృద్ధికి శక్తిమంతమైన నిదర్శనంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికిరక్షణ రంగంలో స్వయంసమృద్ధికి ఊతమివ్వడానికి రాష్ట్రాలు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రధానమంత్రి వివరించారు.

 

***


(Release ID: 2139745) Visitor Counter : 4