ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగా ఉద్యమాన్ని బలపరచడానికి ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధానమంత్రి ప్రశంసలు

प्रविष्टि तिथि: 22 JUN 2025 2:10PM by PIB Hyderabad

యోగాను దైనందిన జీవనంలో ఒక భాగంగా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపిన ప్రేరణదాయక నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఆరోగ్యం, వెల్‌నెస్ కోసం చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమానికి దీనితో మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నారు.

శనివారం (ఈ నెల 21న) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా  రాష్ట్రంలోని క్షేత్రస్థాయిలో వెల్లువెత్తిన ఉత్సాహాన్ని, ప్రజలు చొరవ తీసుకొని ముందుకు వచ్చి అందించిన మద్దతును శ్రీ మోదీ మెచ్చుకొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ:

‘‘ప్రజలను యోగా మరో సారి ఏకతాటి మీదకు తీసుకువచ్చింది. యోగాను తమ జీవనంలో ఓ భాగంగా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఉద్యమాన్ని బలపరిచిన తీరుకు వారికి ఇవే నా అభినందనలు. యోగాంధ్ర (#Yogandhra) కార్యక్రమంతో పాటు, నేను కూడా పాల్గొన్న విశాఖపట్నం కార్యక్రమం.. మంచి ఆరోగ్యం కోసం, శ్రేయస్సు కోసం ఎంతో మందికి ప్రేరణను అందిస్తూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2138797) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam