గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కార్యక్షేత్రాల నుంచి వారసత్వ స్థలాల వరకు అంతటా ఆరోగ్య సంరక్షణ:


2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం 50 దేశవ్యాప్త కార్యక్రమాలతో జియలాజికల్ సర్వే సంస్థ సన్నద్ధం

నాడు పోస్టు చేయడమైనది: 19 JUN 2025 2:22PM by PIB Hyderabad

గనుల మంత్రిత్వశాఖలోని జియలాజికల్ సర్వే సంస్థ (జీఎస్ఐ) జూన్ 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది. ‘ఒకే ధరణి, ఒకే ఆరోగ్యం కోసం యోగా’ అన్న ఈ యేటి ఇతివృత్తానికి అనువైన 50 కార్యక్రమాలను దేశంలోని 46 ప్రాంతాల్లో నిర్వహించాలని... తద్వారా సిబ్బంది, సాధారణ ప్రజల్లో సమగ్ర ఆరోగ్యం, ఆరోగ్యకర జీవనశైలి పట్ల అవగాహన పెంచాలని జీఎస్ఐ భావిస్తోంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందిన వారి నేతృత్వంలో జీఎస్ఐ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కోల్ కతా లోని కేంద్రీయ కార్యాలయం, ప్రాంతీయ, రాష్ట్ర కార్యాలయాలు, 12 వారసత్వ ప్రదేశాలు, 6 డ్రిల్లింగ్ కార్యక్షేత్రాలు, 3 శిక్షణ కేంద్రాల్లో ఈ యోగా సెషన్లు ఏర్పాటవుతున్నాయి. జీఎస్ఐ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, స్థానికులు సహా సుమారు 3,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగలరని భావిస్తున్నారు.

జూన్ 20న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ వేదికగా ఏర్పాటైన ప్రత్యక్ష కౌంట్ డౌన్ ఈవెంట్ లో కూడా జీఎస్ఐ పాల్గొంటుంది.  

సాధారణ ప్రజలు, వైజ్ఞానిక సమాజాల్లో యోగ విజ్ఞానం, సూత్రాల పట్ల అవగాహన పెంపు, యోగాభ్యాసాల ఆచరణకు ప్రోత్సాహం కల్పించాలన్న లక్ష్యంతో జీఎస్ఐ ప్రత్యేక కార్యక్రమాలని రూపొందించింది – తద్వారా ప్రజారోగ్యం, సంక్షేమం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.

 

****


(రిలీజ్ ఐడి: 2137720) సందర్శకుల సూచీ సంఖ్య : : 61
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Malayalam , English , Urdu , Gujarati , Tamil