ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని పుణేలో జెజూరి-మోర్గావ్ రహదారి ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని సంతాపం
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించిన పీఎం
प्रविष्टि तिथि:
19 JUN 2025 10:58AM by PIB Hyderabad
మహారాష్ట్రలోని పుణేలో జెజూరి-మోర్గావ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 నష్టపరిహారాన్ని ప్రకటించారు.
ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
‘‘మహారాష్ట్ర, పుణేలోని జెజూరి-మోర్గావ్ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’.
‘‘మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షల పరిహారం అందుతుంది. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం అందజేస్తాం: PM @narendramodi’’
(रिलीज़ आईडी: 2137639)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam