ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశ యువత మేలు కోరి పరిశోధన, నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థలను మరింత ప్రోత్సాహిస్తూనే ఉంటాం... ప్రధానమంత్రి పునరుద్ఘాటన
प्रविष्टि तिथि:
19 JUN 2025 1:57PM by PIB Hyderabad
‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతించారు. ప్రపంచ విద్య, పరిశోధన రంగంలో భారత్ స్థాయి రోజు రోజుకూ ఎదుగుతోందనడానికి ఇదొక నిదర్శనమని ఆయన అన్నారు. భారతదేశ యువతీయువకుల మేలు కోరి పరిశోధన, నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థలను ప్రభుత్వం మరింతగా ప్రోత్సాహిస్తూనే ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:
‘‘ ‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026’ మన విద్య రంగానికి ఒక గొప్ప కబురును తీసుకు వచ్చింది. మన దేశ యువత మేలును కోరుకుంటూ పరిశోధన, నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థలను అభివృద్ధిపరచడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2137635)
आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam