ప్రధాన మంత్రి కార్యాలయం
సైప్రస్, కెనడా, క్రొయేషియాల్లో పర్యటనకు ముందు ప్రధాని ప్రకటన
प्रविष्टि तिथि:
15 JUN 2025 7:00AM by PIB Hyderabad
సైప్రస్, కెనడా, క్రొయేషియా- మూడు దేశాల పర్యటనకు ఈ రోజు నేను బయలుదేరుతున్నాను.
జూన్ 15-16 తేదీల్లో గౌరవ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు సైప్రస్‌లో పర్యటిస్తాను. మధ్యధరా ప్రాంతం, యూరోపియన్ యూనియన్‌లో సైప్రస్ మనకు సన్నిహిత మిత్రదేశం, ముఖ్య భాగస్వామి. చారిత్రక సంబంధాలను దృఢతం చేసుకోవడానికి, అలాగే వాణిజ్యం, పెట్టుబడి, భద్రత, సాంకేతికత రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలను విస్తృతం చేసుకోవడానికి, ప్రజా సంబంధాలను పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశాన్ని అందిస్తుంది.
సైప్రస్ నుంచి నేను కెనడాలోని కననాస్కిస్‌కు వెళ్తాను. ఆ దేశ గౌరవ ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరవబోతున్నాను. ముఖ్యమైన అంతర్జాతీయ అంశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలపై చర్చలకు ఈ సమావేశం వేదిక కాబోతోంది. సదస్సు భాగస్వామ్య దేశాల నేతలతో చర్చించడానికీ నేను ఎదురుచూస్తున్నాను.
జూన్ 18న క్రొయేషియా పర్యటన, ఆ సందర్భంగా అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్, ప్రధానమంత్రి ఆండ్రేజ్ ప్లెన్కోవిక్‌తో సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇరుదేశాల మధ్య శతాబ్దాలుగా సన్నిహిత సాంస్కృతిక సంబంధాలున్నాయి. క్రొయేషియాలో భారత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే తొలిసారి. ఉమ్మడి ప్రయోజనాలున్న రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త దారులు తెరుస్తుంది.
సీమాంతర ఉగ్రవాదంపై మన పోరాటంలో, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ రకంగా వ్యక్తమయినా దానిని సమర్థంగా ఎదుర్కోవడంపై అంతర్జాతీయంగా అవగాహనను పెంపొందించడంలో భారత్‌కు దృఢమైన మద్దతు అందించిన భాగస్వామ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం కూడా ఈ మూడు దేశాల పర్యటన ద్వారా లభిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2136508)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam