పార్లమెంటరీ వ్యవహారాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవ సూచకంగా యోగా వర్క్‌షాపును నిర్వహించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
Posted On:
12 JUN 2025 1:14PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవ (ఐడీవై) సూచకంగా యోగాపై ఒక వర్క్‌షాప్ (కార్యశాల)ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ వర్క్‌షాపును బుధవారం (జూన్ 11న) న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్‌లో కమిటీ రూమ్ 62లో ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ యోగా సైన్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్ కుమార్ మార్గదర్శకత్వం వహించారు. వర్క్‌షాపును పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సత్య ప్రకాశ్ ప్రారంభించారు. మన దైనందిన జీవనంలో యోగాకు ఎంతటి ప్రాముఖ్యం ఉందీ డాక్టర్ రమేశ్ కుమార్ ప్రధానంగా ప్రస్తావించారు.
మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు అందరితోను, ఉద్యోగులతోను యోగాభ్యాసంతో పాటు ప్రాణాయామం కూడా డాక్టర్ రమేశ్ కుమార్ చేయించారు. కార్యాలయ పనివేళల్లో యోగా చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోగలగడంతో పాటు పని సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చో ఆయన వివరించారు. ఈ కార్యశాలలో మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సత్య ప్రకాశ్, డైరెక్టర్ శ్రీ ఎ.బి. ఆచార్య, డైరెక్టర్ (ఎన్ఐసీ) శ్రీ సంజీవ్, ఉప కార్యదర్శి శ్రీ ముకేశ్ కుమార్, ఉప కార్యదర్శి శ్రీ ఎస్.ఎస్. పాత్రాలతో పాటు మంత్రిత్వ శాఖలోని ఇతర అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొన్నారు.
***
(Release ID: 2136232)
Visitor Counter : 3