ప్రధాన మంత్రి కార్యాలయం
వివిధ భారత ప్రాతినిధ్య బృందాల సభ్యులతో భేటీ అయిన ప్రధానమంత్రి
ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచానికి చాటిచెప్పినందుకు ప్రధానమంత్రి ప్రశంసలు
प्रविष्टि तिथि:
10 JUN 2025 9:25PM by PIB Hyderabad
ఉగ్రవాద నిర్మూలనపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించిన ప్రాతినిధ్య బృందాల సభ్యులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈరోజు న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. శాంతి పట్ల భారత నిబద్ధతను.. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన ఆవశ్యకతను ప్రపంచ దేశాలకు స్పష్టంగా వివరించడంలో ప్రతినిధులందరూ కీలక పాత్ర పోషించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ వేదికలపై భారత వాణిని వినిపించడంలో వారు చూపిన అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.
‘ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు:
“శాంతి పట్ల భారత్ నిబద్ధతను.. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన ఆవశ్యకతను వివిధ దేశాలకు వివరించిన భారత ప్రాతినిధ్య బృందాల ప్రతినిధులను కలిశాను. వారు భారత్ వాణిని వినిపించిన తీరు మనందరికీ గర్వకారణం.”
***
(रिलीज़ आईडी: 2135532)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada